మత్తులో జరిగే హత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మద్యపానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్న చీప్ లిక్కర్‌ను తాగి రెండేళ్లుగా ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారన్నారు. మూడు దశల్లో మద్యపాన నియంత్రణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు మడమ […]
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 1982లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన మధుసూదనాచారి.. 1994-99 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో […]
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరింయట్‌పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సారి కనుక ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగి ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేశ ప్రభుత్వాలదేనని తెలిపింది. కరోనా కొత్త వేరింయట్ ఒమిక్రాన్ ఇప్పటి వరకు 89 దేశాలకు వ్యాపించినట్లు who తెలిపింది. ఈ వేరియంట్ సోకిన ప్రాంతాల్లో కేసులు, రెండు మూడు రోజుల్లోనే రెట్టింపు […]
పరుగుల రాణి పిటి ఉషపై కేరళలోని కోజికోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జెమ్మా జోసెఫ్ కొనుగోలు చేశారని, వాయిదాల రూపంలో రూ. 46 లక్షలు చెల్లించారని తెలిపారు. Read Also:కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక ఉగ్రవాది హతం అయినప్పటికీ ఆ ఫ్లాట్‌ను బిల్డర్ జోసెఫ్‌కు ఇవ్వలేదు. అయితే పిటి ఉష […]
కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. […]
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు పట్టణంలో రూ.70 నుంచి రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల రూ.20 కోట్లు మంజూరయ్యాయని, దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ 167 ఎకరాల్లో రూ.91.68 కోట్లతో ఆలయ ట్యాంకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బండ్ నిర్మాణానికి […]
కోవిడ్‌తో అనాధలైన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృష చేస్తుంది. ఇప్పటికే వారికి సాయం ప్రకటించింది. అయితే ఆ సాయం నేరుగా వారికే చేరేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను ఇక ఆన్లైన్ చేసేందుకు కోవిడ్ 19 పోర్టల్‌ను తీసుకొచ్చింది. కరోనా వైరస్ (కోవిడ్ – 19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించడానికి ఆన్లైన్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి […]
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది. […]
నగరంలో సందడి నెలకొంది. బుక్ ఫెయిర్ మళ్లీ ప్రారంభం కావడంతో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం హోరెత్తింది. ట్రాలీలు పుస్తకాల డెక్‌లను డెలివరీ చేయడం స్టాల్ నిర్వాహకులు వాటిని పూర్తి ఉత్సాహంతో ఏర్పాటు చేయడంతో, ఈసారి 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పుస్తక ఎంపికల సాగరానికి ఎన్టీఆర్ స్టేడియం సిద్ధమైంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 28 వరకు జరుగుతుంది. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఢిల్లీ, ముంబై […]
తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులకు చేయూతనందించడం కోసం వారికి ఆర్థిక సాయం అందించాలని గతంలోనే ప్రతిపాదించింది. కాగా ఇప్పటికే మొదటి విడతలో చాలా మంది రూ.10వేలకు పైగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో రూ.10వేల రుణం చెల్లించిన వారికి రెండో విడతలో రూ.20వేల వరకు పంపిణీ చేయాలని ఇప్పించాలని నిర్ణయించింది. Read Also:కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం […]