అమెరికా వంటి దేశాలలో మన తెలుగు వారు చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదంటే అతిశయోక్తి లేదు. అమెరికాకు భారతీయురాలు ఉపాధ్యక్షురాలు కావడం అంటే మన దేశం ప్రజల ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాతృ దేశానికి సేవలు చేస్తున్నారు. ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఎక్కడ ఏం సంపాదించినా చివరకు మిగిలేది చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే. ప్రజలకు సేవ చేయాల్సిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. ఆటా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. పేద దేశాలకు వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. రానున్న రోజుల్లో సరికొత్త సాంకేతిక తో పాటు రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఏ లక్ష్య సాధన కోసం తెలంగాణ సాధించుకున్నాం అందు కోసం కృషి చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రపంచంలో పది మంది ఐటీ నిపుణులతో అందులో ఐదు మంది భారతీయులే ఉంటారు. ఐదుగురు ఒక ఊరిలో ఒక తెలుగువారు. ఐటీ నిపుణులు అత్యధికులు తెలుగువారే ఉండడం గర్వకారణం. అమెరికా ఆర్థిక వ్యవస్థ లో మన తెలుగువారి పాత్ర విడదీయలేనిది. అమెరికా అభివృద్ధిలో మన పాత్ర అత్యంత కీలకమైనది.
అమెరికా వంటి దేశంలో రాజకీయాలలో కూడా తెలుగు వారి ప్రాముఖ్యతను పెంచాలి. అమెరికాలో మన తెలుగు విద్యార్థులకు ఆటా చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆటా వేడుకలు జరగడం సంతోషంగా వుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కూడా అవసరం. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్తులో అభివృద్ధి సాధించాం. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.