తిరుమలలో పరిణామాలపై మండిపడ్డారు గోవిందానంద సరస్వతీ స్వామీజీ. కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుగా వున్న గోవిందానంద సరస్వతీ స్వామీజీ టీటీడీ వ్యాపార ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు. శ్రీవారిని రోడ్డుమీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..? శ్రీవారి సేవలు వెల కట్టలేనిది. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదు. స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనేవిధంగా టీటీడీ […]
దేశంలో చలిగాలులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 3.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read: ఇలాంటి లైఫ్ […]
1 దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు ఇప్పటి వరకు దేశంలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్లో మరణాల రేటు తక్కువగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలోనే బ్రిటన్‌లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే దీనిపై రాష్ట్రాలను హెచ్చరించింది. ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు 2 దశాబ్దాలుగా ఉన్న ఎన్నికల సవరణ చట్టాల బిల్లుకు కేంద్ర […]
దశాబ్దాలుగా ఉన్న ఎన్నికల సవరణ చట్టాల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఓటర్ కార్డుతో-ఆధార్ అనుసంధాన బిల్లును లోక్ సభలోసోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మొదటినుంచి విపక్షాలు అడ్డుకోవాలని చూసినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యంగా బోగస్ ఓట్లను గుర్తించడానికి వాటికి చెక్ పెట్టేందుకు దీనిని తీసుకొస్తున్నామని ప్రకటించినా విపక్ష సభ్యులు తమ ఆందోళనలను మాత్రం విరమించలేదు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు […]
2020 కి ముందు ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్‌గా ఉండేది. ఎవరి యాంబీషన్స్ ను వారు రీచ్ అయ్యేందుకు పరుగులు తీస్తుండేవారు. ఎవరికి ఎవరూ సంబంధం లేకుండా, లైఫ్ ను లీడ్ చేస్తూ, టెక్నాలజీని జీవితంలో భాగం చేసుకుంటూ ప్రయాణం చేసేవారు. ఇదంతా 2020 కి ముందు. 2019 డిసెంబర్లో చైనాలో కరోనా మహమ్మారి ఎటాక్ చేయడం మొదలయ్యాక ఆ పరుగులు ఆగిపోయాయి. చాలా మంది జీవితాలు వికసించే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి కుదేసింది. వికసించాల్సిన […]
తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని […]
రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, మరి తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి ఉప్పుడు బియ్యమని, దొడ్డు బియ్యం అని, రా రైస్ అని ఎందుకు వంకలు పెడుతున్నారని విమర్శించారు. పంజాబ్ వడ్లు ఎలా తియ్యగైనయని, తెలంగాణ వడ్లు చేదెందుకైనవని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతుబంధు సమితి […]
టెస్లా కారు రాజసానికి ప్రతీకగా మారింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా దూసుకుపోతున్నది. లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. టెస్లా ఎన్నో రకాల మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో టెస్లా ఎస్ మోడల్ కారును వాహనదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ కారును కొనుగోలు చేసిన ట్యుమస్ అనే వ్యక్తికి టెస్లా చుక్కలు చూపించింది. మొదటి 1500 కిలోమీటర్లు కారు చాలా అద్భుతంగా ఉందని, 1500 కిమీ ప్రయాణం తరువాత సమస్యలు రావడం మొదలయ్యాయని, ఆటోమేషన్ […]
సిద్ధిపేటలో మంత్రి హరిష్ రావు తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టంలో తొలిసారి ఈ తరహా ప్లాంట్‌ను సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడిచెత్త నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. తడిచెత్తలో వచ్చే సూదులు, శానిటరీ ప్యాడ్లు, ఔషధ వ్యర్థాల దహనానికి ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్థానికంగా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. సిద్ధిపేటను అన్ని […]