రచ్చబండ అడ్డుకున్న ప్రభుత్వంపై భట్టి విక్రమార్క ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, MLC జీవన్ రెడ్డి, MLA శ్రీధర్ బాబులతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేయించిన కేసీఆర్ సర్కారు చర్యను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతీవ్రంగా ఖండించారు.
దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయకుండా అడ్డు కోవడం, పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం గత ఎనిమిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలకులు అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదన్నారు. టిఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పరిపాలనపై ఇక తెలంగాణ ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పోలీసులతో నిర్బంధం ప్రయోగించి భావవ్యక్తీకరణ ఆపాలనుకోవడం సర్కార్ పెద్ద పొరపాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
పోలీసులు హౌస్ అరెస్టు చేస్తే వరి ధాన్యం కొనుగోలు పై సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవారా అని ప్రశ్నించారు. ధర్నాల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం? ప్రతిపక్షాలకు మరో న్యాయమా? ప్రజాస్వామ్య పాలనలో ఇదేం పద్దతి అని టిఆర్ఎస్ సర్కార్ ను నిలదీశారు. రచ్చబండ కు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు టిఆర్ఎస్ ధర్నాలను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. TRS ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే పోలీసుల చేత అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
దేశంలో ఇప్పటివరకు రైతులు వరి వేయొద్దు అని ఏ రాష్ట్ర సర్కార్ చెప్పలేదన్నారు. మొట్ట మొదటిసారిగా తెలంగాణ సర్కార్ చేతగానితనంతో వరి వేస్తే ఉరి అని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలని, ఆహార ఉత్పత్తి పెంచాలని, ఆహారధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. కానీ, ఆ బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో వరి పండించొద్దని ప్రభుత్వం పోలీసులు, అధికారులతో రైతుల పై ఒత్తిడి చేయించడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు.
గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన నీటి వనరులతో రైతులు వరి పంటలు పండిస్తారని,. యాసంగి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని. అన్నదాతలు అధైర్యపడొద్దని. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ టీఆర్ఎస్ సర్కార్ లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?