హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంపై దృష్టి సారించింది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి 7, నార్సింగి, రాయదుర్గం పీఎస్ లో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.
మొత్తం సైబరాబాద్ లో 13 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో మూడు కేసులు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లలో నమోదయిన ఎఫ్‌ఐఆర్ ల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ కూపీ లాగుతోంది. వందల కోట్ల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో శ్రీధర్ రావు ఆస్తులు కొన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.