NTV WebDesk
Author- NTV Telugu-
Telangana: ముంచెత్తుతున్న వానలు.. పలు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు
గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జులై మొదటివారంలోనే భారీవర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పదేళ్ల నాటి వర్షపాతం రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. గోదావరి వరదతో భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద […] -
Bihar: దారుణం.. బతికుండగానే బాలికను పాతిపెట్టారు
కూతురు అంటే లక్ష్మీ దేవితో సమానం. ఆడపిల్ల పుట్టిందంటే, తమ ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ చాలామంది సంబరాలు చేసుకుంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుతారు. ముఖ్యంగా.. తల్లి అయితే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇక నానమ్మ కూడా తల్లిలాగే ప్రేమను పంచుతూ.. గారాబం చేస్తుంది. కానీ.. ఇక్కడ ఓ బాలిక పాలిట మాత్రం తల్లి, నానమ్మలు రాక్షసులయ్యారు. బతికుండగానే శ్మశానంలో వాళ్లు ఆ బాలికను పాతిపెట్టారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ […] -
Kadem Project: మంత్రి అల్లోలకి సీఎం ఫోన్.. వరద పరిస్థితిపై ఆరా
తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా.. 64 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొడుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీరుని […] -
Prabhas: ‘మ్యాడ్మ్యాక్స్’ని వద్దని.. ఆ ఫ్లాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్
ప్రభాస్ కటౌట్‌కి మాస్ కమర్షియల్ సినిమాలు బాగా సూట్ అవుతాయి. ప్రేక్షకులు కూడా అతడ్ని ఆ జోనర్ సినిమాల్లో చూడ్డానికే ఎక్కువ ఇష్డపడతారు. అతడు కొట్టినప్పుడు విలన్లు గాల్లో ఎగిరినా.. చూడ్డానికి కన్వీన్స్గానే అనిపిస్తుంది. అతని కటౌట్ అలాంటిది మరి! అందుకే, దర్శకులు అతనికోసం యాక్షన్ కథలే ఎక్కువగా సిద్ధం చేస్తారు. తాను కూడా ఓ భారీ యాక్షన్ కథను ‘చక్రం’ సినిమా సమయంలోనే సిద్ధం చేశానంటూ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కుండబద్దలు కొట్టాడు. ‘చక్రం’ సినిమా […] -
Warangal: 100 శాతానికి మించి వర్షపాతం.. నిండిన చెరువులు
సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి జులై 12 వరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 272.7 శాతం వర్షపాతం కురిసింది. ఇక భూపాలపల్లిలో 153, మహబూబాబాద్‌లో 147, జనగామలో 109, వరంగల్‌లో 95 , హనుమకొండలో 88 శాతం వర్షపాతం నమోదైనట్టు తేలింది. వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా ఎన్టీఆర్ఎఫ్ బలగాలు […] -
Nizamabad: జిల్లాలో కుండపోత వర్షం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కి పోటెత్తిన వరద
నిజామాబాద్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. మెండోరాలో రికార్డ్ స్థాయిలో 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదో రోజు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 10 వేల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు.. కప్పుల వాగు కారణంగా భీంగల్- సిరికొండ మధ్య, […] -
Kajal Aggarwal: కంబ్యాక్‌కి రెడీ.. కానీ ఓ కండీషన్!
పెళ్లయ్యాక హీరోయిన్లు దాదాపు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక తల్లి అయ్యాక మాత్రం పూర్తిగా స్వస్తి పలుకుతారు. తమ భర్త, పిల్లలతో హ్యాపీగా వ్యక్తిగత జీవితంలో లీనమైపోతారు. ఒకవేళ భాగస్వామి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. ఇలా కొందరు కథానాయికలు పునరాగమనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాబితాలోకి త్వరలో కాజల్ అగర్వాల్ చేరబోతోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రస్తుతం మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న ఈ నటి.. […] -
Rakul Preet Singh: అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ప్రతీ స్టార్ హీరో సినిమాలో కచ్ఛితంగా కనిపించేది. దర్శకనిర్మాతలందరూ ఈమె డేట్స్ కోసం క్యూలో నిల్చునేవారు. అలాంటి భామ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగైంది. చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఓవైపు ఫ్యాన్స్ ఈమె కోసం వేచి చూస్తుంటే.. ఈ భామ మాత్రం హిందీ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. […] -
Lingusamy: బన్నీతో సినిమా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
2016లో లింగుసామి, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి గుర్తుందా? తమిళనాడులో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద హడావుడే నడిచింది. కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి ఊసే రాలేదు. భారీస్థాయిలో ప్రకటించిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండు, మూడు సార్లు ఈ సినిమాకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్న వార్తలు వచ్చాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి మాత్రం […] -
Kamal Haasan: ఓటీటీలో ‘విక్రమ్’కు హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్!
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తిరిగి తన […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..