Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాలపై హరీశ్ రావు అభ్యంతరం
- రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
- జెన్కో, సింగరేణి, డిస్కమ్లపైనా హరీశ్ ఆందోళన
- వాటాల విక్రయంపై తుది నిర్ణయం లేదన్న ట్రాన్స్‌కో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కీలక విద్యుత్ రంగానికి చెందిన సంస్థల్లో వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. టీజీ ట్రాన్స్‌కోలో (TG Transco) 26 శాతం వాటాలను ఐపీఓ (IPO) ద్వారా విక్రయించి నిధులు సమీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మితమైన టీజీ ట్రాన్స్‌కో రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థకు వెన్నెముక వంటిదని, వేలాది కిలోమీటర్ల మేర విస్తరించిన విద్యుత్ లైన్లు మరియు హై-వోల్టేజ్ సబ్స్టేషన్లతో కూడిన ఈ సంస్థ అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తి అని తన లేఖలో గుర్తుచేశారు. ఈ కీలక వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ తీర్మానాలకు విరుద్ధం.. ద్వంద్వ ప్రమాణాలపై ధ్వజమెత్తు
ట్రాన్స్‌కోలో ప్రైవేట్ వాటాలకు అనుమతినిస్తే, భవిష్యత్తులో టీజీ జెన్కో, సింగరేణి, డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు కూడా మార్గం సుగమం అవుతుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోతో పాటు 2023 రాయ్‌పూర్ తీర్మానాలకు పూర్తిగా విరుద్ధమని ఆయన ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత లేని, తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థల్లో మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామని గతంలో స్పష్టం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు దానికి భిన్నంగా నడుచుకుంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ వంటి సంస్థల వాటాలను విక్రయిస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలోకి రాగానే అందుకు భిన్నంగా వ్యవహరించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని నిలదీశారు. విద్యుత్ సంస్థల యాజమాన్య హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్న టీజీ ట్రాన్స్‌కో
కాగా, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, వాటాల విక్రయం లేదా పబ్లిక్ ఇష్యూ అంశాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీజీ ట్రాన్స్‌కో వర్గాలు స్పందించాయి. ట్రాన్స్‌కోలో వాటాల ఉపసంహరణ లేదా ఐపీఓకు వెళ్లే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!