OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
- వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో సుదీర్ఘంగా వన్ టూ వన్ మీటింగ్స్..
- ఒక్కో జిల్లాకు అరగంట నుంచి 45 నిమిషాలు కేటాయింపు..
- స్టేట్, రీజినల్ కో ఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షుడు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ జిల్లా అధ్యక్షులకు జగన్ సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారా? తగ్గేదేలే… స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశారా? డబ్బులు, పవర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కబోయిన వాళ్ళకు తాడేపల్లిలో తలంటి పంపేశారా? వన్ టూ వన్ మీటింగ్స్‌లో అసలేం జరిగింది? దాదాపు పదిగంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశాల్లో పార్టీ లీడర్స్‌కు ఎలాంటి క్లాస్ పీకారు జగన్?
చాలా రోజుల తర్వాత….వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్… పార్టీ నాయకులతో వన్ టూ వన్ భేటీలు నిర్వహించారు. గతంలోఅందర్నీ ఒకేచోట కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసే జగన్.. ఈసారి మాత్రం స్టైల్ మార్చారు. ఒక్కో జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్‌తో విడివిడిగా మాట్లాడారు. దాదాపు పది గంటల పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ భేటీలు సాగాయి. ఒక్కో జిల్లాకు అరగంట నుంచి 45 నిమిషాల వరకు సమయం కేటాయించి.. ప్రతి నియోజకవర్గం పరిస్థితిపై కూలంకషంగా ఆరా తీశారట. జగన్‌తో భేటీ సమయంలో.. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సంబంధిత జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్ మాత్రమే ఉన్నారు.
Also Read
దీంతో… ఎందుకిలా…? ఇన్సైడ్ ఏం జరిగిందంటూ రకరకాల చర్చలు మొదలయ్యాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఓవరాల్‌గా ఇది సాధారణ సమీక్ష కాదన్నది వైసీపీ వర్గాల మాట. క్షేత్ర స్థాయిలో పార్టీ బలం నుంచి, స్థానిక ఎన్నికల్లో పోటీ, గెలుపు అవకాశాలు, డబ్బు ఖర్చులాంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది ఇన్సైడ్ టాక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక మీదే జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ వంటి పదవులకు.. ఒక్కో స్థానానికి మూడు పేర్లు సూచించాలని ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా అధ్యక్షులు తాము సిద్ధం చేసుకున్న జాబితాలతో ఈ మీటింగ్‌కు వచ్చారట. ఆ లిస్ట్ చూసిన పార్టీ అధ్యక్షుడు జిల్లా ప్రెసిడెంట్స్‌ను చాలా ప్రశ్నలే అడిగినట్టు తెలిసింది.
సదరు అభ్యర్థి ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. ఎంత విధేయతతో ఉంటారు.. గెలిచాక మనతోనే ఉంటారా.. అధికార పార్టీ నుంచి వచ్చే వత్తిళ్ళను ఎంతవరకు తట్టుకుని నిలబడగలరు.. కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గుతారా..అంటూ రకరకాల ప్రశ్నలు వేసినట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్షులు తెచ్చిన అభ్యర్థుల జాబితాను.. పార్టీ దగ్గర ఇప్పటికే ఉన్న సమాచారంతో మ్యాచ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జాబితాలో సూచించిన వ్యక్తి బలమైన అభ్యర్థి కాకపోతే.. ఫలానా వ్యక్తి బలంగా ఉన్నారు కదా…? ఆయనకు కాకుండా మీరు సూచించిన వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రశ్నించినట్టు సమాచారం. ఆ విషయంలో దాటవేత సమాధానాలు చెప్పిన వారికి జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సమావేశంలో వైసీపీ యంత్రాంగం పనితీరుపైనా జగన్ సీరియస్‌గా ఆరా తీశారన్నది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటివరకు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల జాబితాను.. ఆయా జిల్లా అధ్యక్షులకు చదివి వినిపించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా…నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇచ్చిన లిస్ట్‌లు తీసుకొచ్చిన కొందరు జిల్లా అధ్యక్షుల మీద బాగా సీరియస్ అయ్యారట జగన్. ఇన్‌ఛార్జ్‌ల పనితీరు బాగా లేకపోతే.. ఆ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని.. దాచిపెడితే మాత్రం తర్వాత కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలను ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల పనితీరుకు కొలమానంగా భావిస్తున్నారట జగన్.
పనితీరు సరిగా లేనివారిని సాగనంపేలా పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్ణయాలు జరుగుతున్నట్టు సమాచారం. అదేసమయంలో స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం జరిగే అవకాశం ఉంటుందంటూ కొందరు ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. మొత్తం మీద స్థానిక ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇన్‌చార్జ్‌లు కూడా అంతే సీరియస్‌గా పనిచేయాలని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. లేకుంటే తర్వాత సీరియస్ నిర్ణయాలు ఉంటాయన్న సంకేతాలు ఇచ్చి పంపారన్నది వైసీపీ వర్గాల ఇన్సైడ్ టాక్.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..