ప్రభాస్ కటౌట్‌కి మాస్ కమర్షియల్ సినిమాలు బాగా సూట్ అవుతాయి. ప్రేక్షకులు కూడా అతడ్ని ఆ జోనర్ సినిమాల్లో చూడ్డానికే ఎక్కువ ఇష్డపడతారు. అతడు కొట్టినప్పుడు విలన్లు గాల్లో ఎగిరినా.. చూడ్డానికి కన్వీన్స్‌గానే అనిపిస్తుంది. అతని కటౌట్ అలాంటిది మరి! అందుకే, దర్శకులు అతనికోసం యాక్షన్ కథలే ఎక్కువగా సిద్ధం చేస్తారు. తాను కూడా ఓ భారీ యాక్షన్ కథను ‘చక్రం’ సినిమా సమయంలోనే సిద్ధం చేశానంటూ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కుండబద్దలు కొట్టాడు.
‘చక్రం’ సినిమా తీయడానికి ముందు రాయలసీమ బ్యాక్‌డ్రాప్ మ్యాడ్‌మ్యాక్స్ లాంటి ఓ సాలిడ్ యాక్షన్ కథను ప్రభాస్‌కి వినిపించానని కృష్ణవంశీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆ సినిమా చాలా బాగా వస్తుందని, తాము చేద్దామని అతనికి చెప్పానన్నారు. కానీ, ప్రభాస్ మాత్రం దాన్ని రిజెక్ట్ చేశాడన్నారు. అప్పట్లో అతనికి యాక్షన్ కథలే ఎక్కువగా వచ్చాయని, దాంతో వేరేది ఏమైనా చేద్దామని ప్రభాస్ సూచించాడని చెప్పారు. అప్పుడు ‘చక్రం’ ఆలోచన రావడంతో, ఆ సినిమా చేశామని కృష్ణవంశీ వెల్లడించారు. అఫ్‌కోర్స్.. ‘చక్రం’ చిత్రానికి రెండు నంది పురస్కారాలు (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ లిరిసిస్ట్) అయితే వచ్చాయని, కమర్షియల్‌గా మాత్రం అది ఫ్లాప్‌గా నిలిచింది.
ఏదేమైనా.. ప్రభాస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ‘మ్యాడ్‌మ్యాక్స్’లాంటి హాలీవుడ్ స్థాయి కథను వదులుకున్నాడు. మరి, భవిష్యత్తులో ఏమైనా అలాంటి ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడెలాగో ప్రభాస్‌కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది కాబట్టి, ఆ స్థాయి కథతో సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల పంట పండటం ఖాయం.