Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
- బెజవాడ మేయర్ విషయంలో వైసీపీ వ్యూహాత్మక అడుగులు
- ప్రత్యక్ష ఎన్నికతో అభ్యర్థి ఎంపికపై రకరకాల జాగ్రత్తలు
- టీడీపీలో మేయర్ సీటు కోసం విపరీతమైన పోటీ
- జిల్లాలో ప్రాతినిధ్యం కోసం మాకు కావాలంటున్న జనసేన
- అభ్యర్థి విషయంలో ఎక్కడా రియాక్ట్ అవని వైసీపీ నాయకత్వం
- ముందే ప్రకటిస్తే ప్రభుత్వం నుంచి చిక్కులు వస్తాయన్న ఆలోచన
- తమ అభ్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారని వైసీపీ భయం
- ముందు రిజర్వేషన్స్ ఖరారవనివ్వండంటూ సమాధానం దాటవేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విజయవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అధికార కూటమి. ఇదే సమయంలో ఆ సీటు కోసం భాగస్వామ్య పక్షాలు టిడిపి జనసేన మధ్య పోరు పీక్స్‌లో ఉంది. 2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 64 డివిజన్స్కుగాను 49 చోట్ల గెలిచింది వైసీపీ. అంతకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత మేయర్‌గా ఉన్నారు. అయితే… ఈసారి కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ క్రమంలోనే అభ్యర్థి ఎంపికపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. గతంలోలా కాకుండా… ఈసారి మేయర్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నిక జరగబోతోంది. అందుకే కూటమిలో కూడా సీటు పోటీ ఎక్కువైందని అంటున్నారు. ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ తమ కుటుంబ సభ్యులను మేయర్ సీట్లో కూర్చోబెట్టాలని తహతహలాడుతున్నారు. ఇక కార్పొరేషన్ పరిధిలో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన మాజీ కార్పొరేటర్లు ఎంపీ సాయంతో పావులు కదుపుతూ ఒక్క ఛాన్స్ అంటున్నారు. అటు జనసేన కూడా ఎన్టీఆర్ జిల్లాలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేయర్ సీటు మాకే కావాలని పట్టుబడుతున్న పరిస్థితి. నేతల మధ్య పోటీ పెరిగిపోవడం… ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటంతో… సోషల్ మీడియాలో కూడా దీని గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ పరిణామాలతో అప్రమత్తమైన వైసీపీ.. కూటమి అభ్యర్థి ఎవరో ఖరారు అయ్యే వరకు… తమ అభ్యర్థిని ప్రకటించకుండా గుంభనంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చిందట. దీంతోపాటు మేయర్ సీటు ఎవరికి రిజర్వ్ అవుతుందన్న క్లారిటీ కూడా ఇంకా రాలేదు. అధికార పార్టీలో మాదిరిగానే.. వైసీపీ నుంచి కూడా మేయర్ అభ్యర్థిగా పోటీ చేయటానికి చాలా మందే క్యూలో ఉన్నారు. ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నా….. ఫ్యాన్ పెద్దలు ఎక్కడా రియాక్ట్ అవడం లేదట. ఎందుకంటే… ఇప్పుడే తొందరపడటం వల్ల సమస్యలు వస్తాయని అనుకుంటున్నారట. లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలిసిపోతే…వారికి కూటమి నుంచి చిక్కులు వచ్చే ప్రమాదం ఉందన్నది వైసీపీ అంచనాగా చెప్పుకుంటున్నారు. దీంతోపాటు మేయర్ అభ్యర్థిగా పోటీ చేసే వారికి కచ్చితంగా ఆర్థిక బలంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి ఎవరో ముందుగా తెలిసిపోతే….కూటమి ప్రభుత్వం వారి ఆర్థిక మూలలను టార్గెట్ చేస్తుందన్న భయం కూడా ఉందట. దీంతో… తమ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసే ఆసక్తి ఉన్నవాళ్ళ పేర్లు తెలుసుకుంటున్నారు తప్ప…తుది నిర్ణయాన్ని బయటికి చెప్పడం లేదని అంటున్నారు. ఎవరు అడిగినా… ముందు రిజర్వేషన్లు ఖరారు కానివ్వండన్నదే వైసీపీ సమాధానం. ముందు కూటమిని డిసైడ్ చేయనివ్వండి. తర్వాత నిర్ణయం తీసుకుంటామని అంటున్నారట. ప్రస్తుతానికి బలమైన అభ్యర్థుల కోసం ఫోకస్ పెట్టామని చెబుతున్నారు. వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!