అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు సివిల్ వ్యాపారం కేసు నడుస్తుంటే మరో వైపు అమెరికా అంతర్గత రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్.
ప్యూర్ EV.. సంస్థ 201 KM రేంజ్ లో.. ePluto 7G Max అనే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివర్స్ మోడ్ కూడా కలిగిన స్కూటర్ గా దీని ప్రత్యేకతలెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ కంపెనీ. ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయటంతో.. ఎంతో స్పెషల్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫైనల్ కీని విడుదల చేసింది. గ్రూప్-4 తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 పరీక్షలో పేపర్ 1లో 7 ప్రశ్నలను అధికారులు తొలగించారు. మరో 8 ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు..
తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు అని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి మరో సంస్థ రావడానికి రెడీ అయింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్‌టెక్ కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ( ఎక్స్ ) అకౌంట్‌లో పోస్టు చేశారు.
పదేళ్ళ తెలంగాణ వ్యవసాయ ప్రగతి నివేదికను మంత్రి నిరంజన్ రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఆవిష్కరించారు. పంటల సాగు విస్తీర్ణం: 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా, 2022-23 నాటికి అది 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది అని తెలిపారు.
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. 119 నియోజక వర్గాలలో కనీవినీ ఎరుగని అభ్యర్థులను బరిలో దించుతాము అని ఆయన అన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదు అని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతను గుర్తించాలి అని రేణాకా చౌదరి అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి 10 సీట్లు కేటాయించాలి అని కమ్మవారి ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు.