EV- ePluto 7G Max: ఇండియన్ రోడ్స్ పై ప్లూటో మ్యాక్స్ మ్యాజిక్.. 201 కి.మీ మైలేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్యూర్ EV.. సంస్థ 201 KM రేంజ్ లో.. ePluto 7G Max అనే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివర్స్ మోడ్ కూడా కలిగిన స్కూటర్ గా దీని ప్రత్యేకతలెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ కంపెనీ. ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయటంతో.. ఎంతో స్పెషల్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా, మరెన్నో స్పెషల్ ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ. మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ .. టోటల్ ఫోర్ కలర్స్ లో దొరుకుతున్న ప్యూర్ EV- ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తోందీ మ్యాక్స సంస్థ.
Read Also: Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో శోభా శెట్టి వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?
Also Read
దీని ఎక్స్- షోరూమ్ ధర.. కేవలం రూ. 1, 14, 999 మాత్రమే.. ఈ స్కూటర్ బుకింగ్.. ఆల్రెడీ నేషన్ వైడ్ గా అనౌన్స్ చేసింది. ప్లూటో సెవెన్ జీ మ్యాక్స్ బుక్ చేసుకున్న వారికి ఈ ఫెస్టివ్ సీజన్ నుంచి డెలివరీ చేస్తోంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీటర్ల నాన్ స్టాప్ గా పరుగులు తీస్తుంది. అంతే కాదు, ఈ EV మరెన్నోఆసక్తికరమైన ఫీచర్లను సైతం కలిగి ఉంది. ఇది హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ను కూడా తీర్చిదిద్దారు. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి సదుపాయాలుండటం మరో స్పెషాల్టీ.
Read Also: Nani: లుక్ మార్చిన న్యాచురల్ స్టార్.. భలే ముద్దొస్తున్నాడే
ఈ స్కూటర్ కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చడం వల్ల.. ఇది 3.21 bhp మేర.. అత్యధిక శక్తినందిస్తుంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ బ్యాటరీ సామర్ధ్యం అత్యంత కీలకంగా చెబుతున్నారు. దీంతో ఈ స్కూటర్ మరింత మెరుగ్గా భారతీయ రహదారులపై పరుగులు దీయటం ఖాయంగా చెబుతున్నారీ కంపెనీ నిర్వాహకులు.
Read Also: Off The Record: రోజాపై బండారు వ్యాఖ్యలకు టీడీపీ నేతలే షాకయ్యారా..? పార్టీని ఇరకాటంలోకి నెట్టాయా?
రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇంకాస్త పెంచడానికి, మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు కలిగి ఉన్నాయని అంటున్నారు. దీంతో పాటు, ఈ EV స్కూటర్ 60 వేల కిలోమీటర్ల వారంట్ తో వస్తోంది. 70 వేల కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు. మీరుండాలంటే ట్రెండీగా మీరెక్కాల్సింది మా ప్లూటో సెవన్ జీ మ్యాక్సేగా.. అని కస్టమర్లకు పిలుపునిస్తోంది ప్యూర్ ఈవీ!
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?