Washington: మెరికా అధ్యక్షుకుడు జో బిడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ని కలవనున్నారని అతర్జాతియ మాధ్యమాల సమాచారం. వివరాలలోకి వెళ్తే.. బలహీన పడిన చైనా,యుఎస్ మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. నవంబర్ లో శాన్‌ఫ్రాన్సిస్కోలోని వైట్‌హౌస్ లో ఈ సమావేశం జరగనుంది. రెండు దేశాల మధ్య స్థిరమైన సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరగనుందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి అని వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు ఈ-మెయిల్‌లో తెలిపారు. ఈ సమావేవం నిర్వహించాలని ఇరుదేశాల అధ్యక్షులు దృఢ నిర్ణయం తీసుకున్నట్లు మాధ్యమాల సంచారం.
Read also:Akshay Kumar: ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన హీరో… ఇప్పుడు డే 1 కలెక్షన్స్ రెండు కోట్లు
కాగా ఒక పరిపాలన అధికారి ఈ విషయం పైన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారని కానీ ఈ సమావేశం గురించి ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదని.. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయన తెలిపారు. రాబోయే వారాల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాషింగ్టన్‌కు వచ్చిన తర్వాత ప్రణాళికలు మరింత స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ సమాచారం ప్రకారం.. గత సంవత్సరం నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్ కు హాజరైయ్యారు ఇరుదేశాల అధ్యక్షులు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. ఈ దౌత్యం US-చైనా సంబంధాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.