Donald Trump: వరుస వివాదాల్లో ట్రంప్.. న్యూక్లియర్ సీక్రెట్స్ లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America; అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు సివిల్ వ్యాపారం కేసు నడుస్తుంటే మరో వైపు అమెరికా అంతర్గత రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. వివరాలలోకి వెళ్తే.. US అణ్వాయుధశాలలో కొన్ని ఆయుధాల గురించి అత్యంత రహస్య విషయాలను ట్రంప్ లీక్ చేశారనే ఆరోపణ వెలుగు చూసింది. ABC న్యూస్ మరియు ది న్యూయార్క్ టైమ్స్ నివేదికల ప్రకారం అమెరికా నావికాదళానికి చెందిన ఎలైట్ సబ్‌మెరైన్ ఫ్లీట్‌కు సంబంధించిన కీలక వివరాలను ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్‌కు మరియు మరికొంతమంది స్నేహితులకు సమాచారం అందిచారు ట్రంప్.
Read also:Joe Biden: జిన్‌పింగ్ ని కలవనున్న జో బిడెన్.. కారణం ఇదేనా..?
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ట్రంప్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగినప్పటినుండి అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. తన ఫ్లోరిడా మాన్షన్‌లో రహస్య పత్రాలు దొరకడం, పౌరులకు యుద్ధ ప్రణాళికల వివరాలను వెల్లడించడం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి అసెస్‌మెంట్‌లను కలిగి ఉన్న పత్రాలను తిరిగి పొందడానికి ప్రభుత్వ చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడం వంటి 40 కౌంట్‌లపై ఫెడరల్ నేరారోపణతో పోరాడుతున్నారు. కాగా ఈ ఆరోపణల పైన స్పందించిన ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో జలాంతర్గామి ఆరోపణలను “తప్పుడు మరియు హాస్యాస్పదమైనది” గా అయన పేర్కొన్నారు. కాగా 2017 లో అధ్యక్ష పదివి స్వీకరణ ప్రారంభంలో ట్రంప్ ఇజ్రాయెల్ నుండి రష్యా విదేశాంగ మంత్రి మరియు రాయబారికి కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందించినట్లు నివేదిక ఉంది.
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!