Australia: విమానంలో ప్రయాణించాలని చాలా మందికి ఉంటుంది. ఆకాశంలో మేఘాలను తాకుతూ ప్రయాణించడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుది. కానీ ఆ విమానాలకు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలతో బయటపడం చాల కష్టం. ఇలా విమాన ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వాళ్లు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. శుక్రవారం ఆస్ట్రేలియా లోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో ఓ దర్గటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. వివరాలలోకి వెళ్తే.. Cirrus SR22 కాన్‌బెర్రా నుండి బయలుదేరింది. బయలు దేరిన కొంత సమయం తర్వాత.. సిడ్నీ నుండి దాదాపు 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వీన్‌బెయాన్ పట్టణానికి సమీపం లోకి ప్రవేశించిన విమానం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు
కూలిపోయింది.
Read also:Donald Trump: వరుస వివాదాల్లో ట్రంప్.. న్యూక్లియర్ సీక్రెట్స్ లీక్..
విమానం కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి మరియు పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీస్లులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. విమానం కూలిపోయి మంటల్లో చిక్కుకుందని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని.. అయితే ఎవరు ప్రాణాలతో బయటపడలేదని.. పైలట్ మరియు ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదానికి గురైన ఈ విమానం సందర్శనా, ఫోటోగ్రఫీ మరియు వ్యక్తిగత అవసరాలకోసం వినియోగించే తేలికపాటి విమానం. ఇందులో పైలెట్ మరియు ముగ్గురు పిల్లలు మాత్రమే వున్నారు. కాగా ఊహించని విద్ధంగా ప్రమాదానికి గురైన ఈ విమానము లోని వారంతా మరణించినట్లు పోలీసులు తెలిపారు.