నేడు ( శుక్రవారం ) హైదరాబాద్ వేదికగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తురుణ్ చుగ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Read Also: Ayalaan Teaser: అంతరిస్తున్న భూమిని కాపాడడానికి వచ్చిన ఏలియన్..
ఈ సందర్భంగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. 119 నియోజక వర్గాలలో కనీవినీ ఎరుగని అభ్యర్థులను బరిలో దించుతాము అని ఆయన అన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదు అని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. BRSను ఓడించే పార్టీ బీజేపీ పార్టీనే అని ప్రజలు భావిస్తున్నారు.. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు.. కొంత మంది పని కట్టుకొని నాపై తప్పుడు ప్రచారం చెస్తున్నారు.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసి నన్ను మునుగొడులో ఓడించారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Renuka Chowdhury: కమ్మ సామాజిక వర్గానికి 10 సీట్లు కేటాయించాలి..
తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు బీజేపీ బలమైన అభ్యర్థులను నిలుపుతామని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ నాపై నమ్మకం ఉంచి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పదవి అప్పజెప్పింది.. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ లెక్కల ప్రకారమే కాంగ్రెస్ లో బీ-ఫామ్ పంపకాలు జరుగుతున్నాయి.. కేసీఆర్ దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని వెళ్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.