Mounika
Author- NTV Telugu-
Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
బాలీవుడ్ వెర్సటైల్ నటి అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్‌ను గడుపుతోంది. ‘ఆల్ఫా’ చిత్రంతో రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హారర్ మైథలాజికల్ వండర్ ‘తుంబాడ్’ సీక్వెల్లో అలియా ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తుంబాడ్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. […] -
Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
ఇండస్ట్రీలో లవ్.. బ్రేకప్ లు కామన్. ఇందులో భాగంగా సీనియర్ హీరోయిన్ తమన్న, విజయ్ వర్మల జంట ఎంత ఫేమస్ అయిందో అంతే త్వరగా ముగిసిపోయింది. అప్పటి నుండి వీరి ప్రేమ వ్యవహారాలపై తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. అయితే తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు ఆమె ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నప్పటికీ, తాజాగా ప్రేమ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జీవితంలో కేవలం […] -
Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు అట్లీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. తదుపరి షెడ్యూల్లో బన్నీపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ మరియు సైంటిఫిక్ […] -
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, రవితేజ వంటి సినీ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ వేడుకలో అందరి కళ్ళు నాగచైతన్య సమంతలపైనే నిలిచాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా ఈవెంట్లో కానీ, కుటుంబ వేడుకలో కానీ పాల్గొనలేదు. కానీ ఈ రిసెప్షన్లో ఇద్దరూ […] -
Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
నగరికి చెందిన ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన లతీష్, ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకానొక దశలో ఉప్పు దొంగతనం చేసి ఆకలి తీర్చుకున్న రోజులు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి వెళ్తున్నాడని తెలిసి తన అన్నయ్య మాట్లాడటం మానేసినప్పటికీ, ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో పర్ఫామెన్స్ చూసి మళ్లీ మాట్లాడటం తనకు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో తన అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు తనకు అండగా నిలిచారని తెలిపారు. అలాగే.. ‘హైదరాబాద్ […] -
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47′. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అటు ఫ్యాన్స్‌లో, ఇటు సామాన్య ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గతంలో గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి అలాగే.. ఈ సినిమాలో కూడా వెంకటేష్ మార్క్ కామెడీతో […] -
Raashii Khanna: పోలీస్ ఆఫీసర్‌గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘లుఖ్కే’ మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా రూపొందింది. ఈ సిరీస్‌లో రాశీ ఖన్నాతో పాటు పాలక్ తివారీ కూడా ఒక […] -
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
తమిళ సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, నటీనటుల పారితోషికాలు భారంగా మారడంతో శనివారం తమిళనాట షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకేసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ తీసుకోకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకునే ‘ప్రాఫిట్ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ పిలుపు మేరకు ఒక్కరోజు టోకెన్ సమ్మెను నిర్వహించారు. భారీ పారితోషికాల వల్ల తాము ఆర్థికంగా […] -
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్‌మేట్స్’ సిరీస్ రివ్యూ
కాలేజ్ ఫన్, ఫ్రెండ్షిప్, యూత్ ఎమోషన్స్ కలగలిపిన సరికొత్త ఎంటర్టైనర్ ‘బ్యాచ్‌మేట్స్’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. కాలేజ్ లైఫ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథ, నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది. వైవిధ్యమైన కాలేజ్ నేపథ్యంతో పాటు, లైట్ హార్ట్ టోన్ ఎంగేజింగ్ స్టోరీటెల్లింగ్‌తో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ ప్రధానంగా సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ అనే నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. క్యాంపస్ […] -
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
దర్శకధీరుడు ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తన కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఆయన స్క్రిప్ట్ పనులకే చాలా సమయం కేటాయించారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికంటే ‘డ్రాగన్’ విజువల్స్, మేకింగ్ పరంగా బెస్ట్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?