సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. భాషలు, మార్కెట్, ప్రమోషన్స్ అన్నీ ప్లాన్ చేయడం పెద్ద సవాలే. అయితే అలాంటి సమయంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ మాత్రం అసలే వెనక్కు తగ్గలేదు. ఆమె తన తాజా సినిమా ‘రేచల్’ ను నేరుగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆమె కెరీర్లోనే ఒక పెద్ద సాహసంగా చెప్పుకోవాలి. […]
1990లలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో మీనా ఒకరు. చిన్నతనంలోనే నటిగా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరోయిన్గా అగ్రస్థానంలో నిలిచారు. భాషతో సంబంధం లేకుండా రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సూపర్స్టార్లతో నటించి, మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. మీనా కెరీర్లో గ్లామర్ పాత్రలకన్నా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే లేడీ-ఓరియెంటెడ్ పాత్రలే ఎక్కువ. అదే కారణంగా ఆమెకు విభిన్నమైన అభిమాన […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల విషయం పక్కన పెడితే, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి ఆమె నటి ఊర్వశి రౌతేలా పై నిప్పులు చిమ్మింది. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో “నేను పూర్తిగా నేచురల్ బ్యూటీ”, “మౌంటేన్ గర్ల్” అంటూ చెప్పిన వ్యాఖ్యలు రాఖీకి నచ్చలేదు. దీంతో ఆమె ఊర్వశిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. Also Read : Bison : ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ […]
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన తాజా చిత్రం ‘బైసన్’ ఇటీవల దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను ప్రతిభావంతుడైన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ధ్రువ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా […]
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా ఈ రోజు పోలింగ్ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగిస్తూ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన భార్య రమ రాజమౌళితో కలిసి షేక్‌పేట్ డివిజన్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా, సాదాసీదాగా వచ్చిన రాజమౌళి దంపతులు ఓటు హక్కును వినియోగించారు. Also Read : Dharmendra: సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత ఈ […]
‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. యువ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆయన కొత్త లుక్, న్యూ యాక్షన్ మోడల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఇక తాజా అప్డేట్ ప్రకారం ‘మోగ్లీ’ టీజర్‌ను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు హారర్, కామెడీ టచ్ కలగలిపిన ఈ మూవీ 2026 సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. జనవరి 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో “రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాలేదు, రీషూట్ జరుగుతున్నాయి” అంటూ ప్రచారంలోకి వచ్చిన వార్తలు అభిమానుల్లో కొంత గందరగోళాన్ని సృష్టించాయి. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే ఆమె, తరచూ తన అభిప్రాయాలను నేరుగా పంచుకుంటూ చర్చకు దారితీస్తోంది. తాజాగా కంగనా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అభిమానులతో ఓ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు వేసిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Also Read : Singer mano:‘ముత్తు’ నుంచి ‘శివాజీ’ వరకు..రజనీ మనసు గెలిచిన మనో! ఓ […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎగ్జైట్మెంట్కు అంతు లేదు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. రజనీ సినిమాలకు తెలుగులో చాలా మంది డబ్బింగ్ చెప్పారు. అయితే, గాయకుడు మనో తన ప్రత్యేకమైన వాయిస్‌తో రజనీ పాత్రలకు సరికొత్త వన్నె తెచ్చారు. ఎంతలా అంటే..? రజనీకాంత్ సినిమాల్లో మనో వాయిస్ ప్రేక్షకులకు అంతగా కట్టి పడేయడం వెనుక కారణం స్పష్టమే ఆయన డైలాగ్ డెలివరీ లో ఉన్న ఎనర్జీ, […]
ముంబైలో మరోసారి సైబర్ మోసం సంచలనం రేపింది. బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ పేరును దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక మహిళా న్యాయవాదిని రూ.5 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్లి ప్రాంతానికి చెందిన షబ్నం మొహమ్మద్ హుస్సేన్ సయ్యద్ అనే న్యాయవాది ఈ మోసానికి గురయ్యారు. జూన్ 2025లో ఇంటర్నెట్లో నేహా కక్కర్ ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొంటూ వచ్చిన వీడియోలు, […]