మెగాస్టార్ ఇంటి ఆడపిల్లలకు జీ 5తో చక్కని అనుబంధమే ఏర్పడింది. అల్లు అరవింద్ సొంత ఓటీటీ సంస్థ ఆహా ఉన్నా, మొన్న చిరంజీవి కుమార్తె సుస్మిత తాను నిర్మించిన వెబ్ సీరిస్ ను జీ 5కే ఇచ్చారు. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన వెబ్ సీరిస్ సైతం జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా […]
ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,855 శాంపిల్స్ పరీక్షించగా.. 246 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 04 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 334 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,97,74,392 కు […]
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’ ఈ నెల12న విడుదల కానుంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకాబోతున్న పెద్ద మలయాళ చిత్రమిది. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఓప్పందం కూడా జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని కాదని […]
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉంది ,తరవాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరుకుంటుంది. పశ్చిమ మధ్య మరియు దానిని […]
వరుణ్ తేజ్ నటించిన ‘గని’ విడుదలకు సిద్ధం అవుతోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘గని’ గీతం విడుదల విడుదలై చక్కటి స్పందన తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఈ గీతాన్ని రీ క్రియేట్ చేశాడు. యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం వీడియోలో అల్లు అయాన్ వరుణ్ తేజ్ వర్కౌట్ వీడియోను రీక్రియేట్ […]
జాతీయ ప్రాజెక్టైన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం.. సెకీ ఒప్పందం విషయంలో రివర్స్ టెండరింగుకు ఎందుకు వెళ్లడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కాయి.. అయినా రివర్స్ టెండరింగుకు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే.. రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారోననే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సోలార్ పవర్ కొనుగోళ్ల […]
తెలుగు పరిశ్రమ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎదో ఒక సెంటిమెంట్ ని నమ్ముతుంటారు. ఇలాంటి సెంటిమెంటల్ వాతావరణంలో ఓ దర్శకుడు తన నటీనటులు, సిబ్బందికి జ్యోతిష్యం చెబుతూ తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. అతడెవరో కాదు ‘అందాల రాక్షసి’తో దర్శకుడుగా మారిన హను రాఘవపూడి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమా తీస్తున్న ఇతగాడికి జ్యోతిష్యం బాగా పట్టిందట. తనను కలసిన నటీనటులకు, సన్నిహితులకు ముందుగా జ్యోతిష్యం చెబుతూ ప్రతిభను చాటుతున్నాడట. […]
ఈ యేడాది చివరిలోగా పాపులర్ బాలీవుడ్ పెయిర్స్ కొన్ని పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాయనే ప్రచారం బాగా జరుగుతోంది. అలియాభట్, రణబీర్ కపూర్ తో పాటు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సైతం త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే రూమర్స్ విశేషంగా స్ప్రెడ్ అవుతున్నాయి. డిసెంబర్ లో క్రతినా-విక్కీ వివాహం రాజస్థాన్ లో జరుగబోతోందని, దీపావళి రోజున రోకా ఫంక్షన్ కూడా జరిగిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, దాదాపు పదేళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న రాజ్ […]
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యురాలు, నిర్మాత శ్రీమతి సంధ్య రాజు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తీసిన సినిమా ‘నాట్యం’. ఈ సినిమా ఇండియన్ పనోరమా 2021కు ఎంపిక అయింది. ఈ సంవత్సరం జ్యూరీ సభ్యులలో తెలుగువారు ఎవరు లేనప్పటికీ పనోరమాకు తెలుగు నుంచి ‘నాట్యం’ ఒకటే సినిమా ఎంపిక కావడం గర్వకారణం అంటూ నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రసన్నకుమార్, కార్యదర్వి వడ్లపట్ల మోహన్ అభినందించారు. నిర్మాత సంధ్య రాజు, దర్శకులు రేవంత్ కోరుకొండతో పాటు టీమ్ […]
బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ కు డబుల్ ధమాకా లభించింది. కొద్ది రోజుల క్రితమే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది కంగనా రనౌత్. తాజా సోమవారం రాష్ట్రపతి గౌరవనీయులు రామ్ నాథ్ కోవింద్ నుండి పద్మశ్రీ పురస్కారం పొందింది. భారత ప్రభుత్వం తనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని కంగనా తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన మనసులోని […]