దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’ ఈ నెల12న విడుదల కానుంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకాబోతున్న పెద్ద మలయాళ చిత్రమిది. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఓప్పందం కూడా జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని కాదని ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కి వెళుతున్నారు. దానికి కారణం మమ్ముట్టి అట. నెట్‌ఫ్లిక్స్ తో 40 కోట్లకు డీల్ కుదిరింది. ఇది మంచి లాభంతో కూడి బేరం కూడా. అయితే మమ్ముట్టి ఈ సినిమా చూసి థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని చెప్పారట. దుల్కర్ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో ఓటీటీ డీల్ రద్దు చేసుకుని మరీ థియేటర్ రిలీజ్ కి వస్తున్నారు. థియేటర్లలో విడుదల చేస్తే కరోనా తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కు లాభసాటిగా ఉంటుందని మమ్ముట్టి చెప్పారట. దాంతో తండ్రి మాట ప్రకారం డిజిటల్ డీల్ రద్దు చేసుకుని థియేట్రికల్ రిలీజ్ కి వస్తున్నాడు దుల్కర్. దుల్కర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్, టొవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ వాజ్ పాయి, సన్నీవేన్, షైన్ టామ్ ఛాకో, శోభిత ధూళిపాళ, సురభి లక్ష్మి ఇతర ముఖ్య పాత్రధారులు. ట్రైలర్ రిలీజ్ అయిన ఈ సినిమా విజువల్స్ ను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ పై 10వ తేదీన ప్రదర్శించనున్నారు. మరి డిజిటల్ డీల్ కాదని థియేటర్ రిలీజ్ చేస్తున్న దుల్కర్ కు ‘కురుప్’ తో ఎలాంటి విజయం దక్కుతుందో చూద్దాం.