కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి లో ఉంది. ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. అందరికీ సమస్యలు ఉన్నాయి… కానీ పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి. కోమటిరెడ్డి నేరుగా సోనియా గాంధీ తో మాట్లాడే వెసులు బాటు ఉంది. Vh మాట్లాడుతున్నారు కోమటిరెడ్డితో అని చెప్పారు. నేను కూడా ఇంకొంత మంది నాయకులతో మాట్లాడతా… కలిసి పని చేయాల్సిన సమయం ఇది. హుజూరాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు రావడం ఇబ్బందే. […]
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరుకోలేదు అనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టీం ఇండియా ఓడిపోయిన రెండు మ్యాచ్ లలో టాస్ ప్రధాన పాత్ర పోషించిందని అన్నాడు. టాస్ ఓడిపోవడం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆ మిగిత జట్లకు కలిసి వచ్చింది అన్నారు. అయితే ఈ మాటలను కొట్టిపారేశారు భారత సీనియర్ బౌలర్ హర్భజన్ […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగి నెల రోజులు పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడు ఆ సందడి సద్దుమణుగుతోంది. నిజానికి ‘మా’ ఎన్నికలు జరిగిన రోజునే సినిమా రంగంలోని మరో రెండు యూనియన్ల ఎన్నికలు జరిగినా, ఎవరూ దాని మీద దృష్టే పెట్టలేదు! కారణం… అవన్నీ సజావుగా సాగిపోవడమే! ఇదిలా ఉంటే… ఈ నెల 14వ తేదీ రెండవ ఆదివారం తెలుగు దర్శకుల సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సముద్రకు చెందిన మూడు […]
‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన బాలకృష్ణ, బోయపాటి కాంబో… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘అఖండ’తోనూ అదే పని చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అఘోరగా బాలకృష్ణ గెటప్ అదరహో అన్నట్టుగా ఉంది. ఆ గెటప్ మీద చిత్రీకరించిన ‘భం అఖండ, భం భం అఖండ’ అనే టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా చిత్ర బృందం […]
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే పీవీ సింధు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఈ ఏడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సింధుకు 2015లో పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం […]
బిగ్ బాస్ సీజన్ 5 లో గడిచిన పదివారాల్లో రెండు సార్లు కెప్టెన్ గా పనిచేసిన విశ్వ ఎలిమినేషన్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రేషన్ మేనేజర్ గానూ ఎంతో నిబద్ధతతో విశ్వ పనిచేశాడు. ప్రియా కొన్ని సందర్భాలలో అతన్ని విమర్శించినా, హౌస్ మేట్స్ ఎక్కువ విశ్వ పనితనాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు… హౌస్ లోకి వచ్చిన తొలి రోజు నుండి విశ్వ వీలైనంత వరకూ ఇండివిడ్యువల్ గేమ్ నే ఆడుతూ వచ్చాడు. అందరితో కలివిడిగా ఉంటూ, ముందుకు […]
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ కు చేరాక పోవడం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని అన్నాడు. యూఏఈ లో ఉన్న తేమ ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే పూర్తిగా అడ్వాంటేజ్‌గా మారిందన్నాడు. టీ20 ఫార్మాట్ లో టాస్‌కు ఇంత ప్రాధాన్యత ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఐపీఎల్ 2021 సీజన్, టీ20 ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఆటగాళ్లకు ఉంటే బాగుండేదన్నాడు. […]
ఛత్తీస్‌గఢ్ లో కిడ్నాప్ చేసిన గిరిజనులను వదిలి పెట్టారు మావోయిస్టులు. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని కిడ్నాప్ చేసారు మావోయిస్టులు. అయితే నిన్న అర్ధరాత్రి ఆ ఐదుగురు గిరిజనులను వదిలిపెట్టారు మావోయిస్టులు. ఇద్దరిని చితకబాది హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు… ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను అడవిలోకి ఎత్తుకెళ్లరు మావోయిస్టులు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.