తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యురాలు, నిర్మాత శ్రీమతి సంధ్య రాజు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తీసిన సినిమా ‘నాట్యం’. ఈ సినిమా ఇండియన్ పనోరమా 2021కు ఎంపిక అయింది. ఈ సంవత్సరం జ్యూరీ సభ్యులలో తెలుగువారు ఎవరు లేనప్పటికీ పనోరమాకు తెలుగు నుంచి ‘నాట్యం’ ఒకటే సినిమా ఎంపిక కావడం గర్వకారణం అంటూ నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రసన్నకుమార్, కార్యదర్వి వడ్లపట్ల మోహన్ అభినందించారు. నిర్మాత సంధ్య రాజు, దర్శకులు రేవంత్ కోరుకొండతో పాటు టీమ్ మెంబర్లకు గోవాలో నవంబర్ 21 నుండి 28 వరకు జరిగే ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సన్మానం జరగనుంది.