నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను అందుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయాన్ని ఆసీస్ ఆటగాళ్లు తమ డ్రెసింగ్ రూమ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన కుడికాలు బూటు తీసి చేతిలో ఉన్న బీర్ ను అందులో […]
సమంత అతి త్వరలో ఖతీజాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత ఖతీజా లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుండి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ రాంబోగా కనిపించనున్నాడు. రంజన్ కుడి అన్బరసు మురుగేశ భూపతి ఓహూందిరన్ పేరునే షార్ట్ కట్ లో రాంబోగా మార్చారు. […]
క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్ లు కొనసాగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని కొత్త సెంటిమెంట్ లు వస్తాయి. తాజాగా నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన తర్వాత ఓ కొత్త సెంటిమెంట్ ను అభిమానులు తెరపైకి తెచ్చారు. అయితే ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్ల కెప్టెన్ లు ట్రోఫీని పట్టుకొని ఫోటో దిగుతారు. అయితే ఆ ఫోటో సమయంలో ట్రోఫీకి ఎడమ వైపు ఏ […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ బెగ్గర్’. వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్నఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్యప్రకాష్ క్లాప్ ఇవ్వగా, కార్తీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ మాట్లాడుతూ…’ ‘ఈ చిత్రంలో భద్ర అనే […]
‘సూర్యవంశీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అక్షయ్ కుమార్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పురాణ చిత్రం ‘పృథ్వీరాజ్’ టీజర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ లైఫ్ హిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 జనవరిలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ గా అక్షయ్ టైటిల్ రోల్ పోషించాడు. అతని భార్య సంయోగితగా మానుషి చిల్లార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర […]
వచ్చే యేడాది జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. దాంతో సంక్రాంతి బరిలో నిలిచే ఇతర సినిమాల పరిస్థితి సందిగ్థంలో పడింది. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలను వాయిదా వేశారు. జనవరి 6న రావాల్సిన అలియాభట్ ‘గంగూబాయి కతియవాడి’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. చిత్రం ఏమంటే ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో అలియాభట్ నాయికగా […]
నవంబర్ 14వ తేదీ ఆదివారం తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో దర్శకుడు కాశీ విశ్వనాథ్ కు చెందిన ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. అత్యధిక మంది సభ్యులు ఆయన ప్యానెల్ నుండి ఎన్నిక కావడం విశేషం. ఇక సముద్ర, చంద్రమహేశ్ ప్యానెల్స్ నుండి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. మహిళా రిజర్వేషన్ కోటాలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వి. […]
ఢిల్లీలో “సంక్షోభం లాంటి పరిస్థితి” ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రోజు తిరిగి సర్వోన్నత న్యాయస్థానం లో విచారణ ప్రారంభం అయింది. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా కలిగే వాయు కాలుష్యం కేవలం 10 శాతమే అని నిర్ధారణ అయుందని ధర్మాసనానికి వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయుతే, “దేశ రాజధాని ప్రాంతం” ( ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పరిమితులు, నిబంధనలు అమలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొంది […]
ప్రపంచ కప్ టోర్నీలో టాస్ ఓ సమస్యగా ఉంది అని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే ఈ టోర్నీలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి లాభం ఉంటుందని చెప్పారు. ఇది ఐసీసీకి ఓ సమస్య చెప్పిన ఆయన.. దీని పై ఐసీసీ చర్చించాలని… రెండు జట్లకు మైదానం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని గవాస్కర్ తెలిపారు. అయితే నిన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ముందు భారీ లక్ష్యమే […]