ఆకట్టుకుంటున్న అక్షయ్ ‘పృథ్వీరాజ్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సూర్యవంశీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అక్షయ్ కుమార్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పురాణ చిత్రం ‘పృథ్వీరాజ్’ టీజర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ లైఫ్ హిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 జనవరిలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ గా అక్షయ్ టైటిల్ రోల్ పోషించాడు. అతని భార్య సంయోగితగా మానుషి చిల్లార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర పాత్రలో సంజయ్ దత్, సోనూసూద్, అసుతోష్ రాణా, సాక్షి తన్వర్, లలిత్ తివారి కనిపించనున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.
ఒక నిమిషం 22 సెకన్ల ఈ టీజర్ గూస్‌బంప్ తెప్పిస్తోందంటూ పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ టీజర్ ను షేర్ చేస్తూ ‘అహంకారం, శౌర్యంతో కూడిన వీరోచిత కథ ఇది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉంది. 21 జనవరి 2022న బిగ్ స్క్రీన్ లో మీవద్దకు వస్తోంది’ అని ట్వీట్ చేశాడు. 2019లో ఆరంభమైన ఈ సినిమాపై అన్ని సినిమాల్లాగే కరోనా ఎఫెక్ట్ పడింది. 2020 దీపావళికి విడుదల కావలసిన ‘పృథ్వీరాజ్’ ఎట్టకేలకు 2022 జనవరి 21న విడుదల కానుంది. 2010లో ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినపుడు చంద్రప్రకాశ్ ద్వివేది సన్నిడియోల్, ఐశ్వర్యారాయ్ తో తీయాలనుకున్నాడు. అప్పట్లో సన్నిడియోల్ డేట్స్ దొరకక పోవడంతో పాటు ఏ నిర్మాణ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకు రాకపోవడంతో పక్కన పెట్టేశాడు. అయితే అనూహ్యంగా అక్షయ్, యశ్ రాజ్ ఫిలిమ్స్ కలయికలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాడు. మరి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో ఆక్షయ్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూద్దాం.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!