రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కివీస్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్ తో టీ20 సిరీస్ నుండి తప్పుకున్నాడు. ఈ విషయం తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నవంబర్ 25 నుండి ఇండియాతో కాన్పూర్‌లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ పై దృష్టి పెట్టడానికి కేన్ విలియమ్సన్ టీ20 […]
నవంబర్ మొదటి రెండు వారాలు కలిపి దాదాపు పది తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఒక్క మూడో వారంలోనే పది సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండే పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మరో రెండు నెలల పాటు తమకు థియేటర్లు దొరకవేమోననే ఆందోళనలో చిన్న చిత్రాల నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ తో పాటు జనవరిలోనూ అగ్ర కథానాయకుల చిత్రాలు మూడు పండగ బరిలో నిలుస్తున్నాయి. […]
ఈరోజు ఉదయం నుండి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పాండ్యా వద్ద 5 కోట్ల విలువగల విదేశీ వాచులు ముంబై ఎయిర్ పోస్ట్ లో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసారని వార్తలు వస్తున్నాయి. అదే దీని పైన పాండ్యా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దుబాయ్ నుండి తెచ్చిన వస్తువులను… నేనే స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకెళ్లానని… దానికి అవసరమైన మొత్తాన్ని […]
తెలుగు చిత్రసీమలో అనేక మంది జానపద కథానాయకులు ఉన్నా, ‘కత్తి’ అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్న హీరో కాంతారావు అనే చెప్పాలి. ఈ నాటికీ ఆయనను ‘కత్తి’ కాంతారావు అనే ఎంతోమంది అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. నటరత్న యన్.టి.రామారావు తరువాత అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించిన ఘనత కాంతారావు సొంతం. ఇక యన్టీఆర్ తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లోనూ నటించి అలరించారు కాంతారావు. అన్నిటినీ మించి నారద పాత్రలో కాంతారావు అభినయం నభూతో నభవిష్యతిగా […]
నవతరం కథానాయకుల తకధిమితైలకు సరితూగేలా సరిగమలు పలికిస్తున్నారు థమన్. టాప్ స్టార్స్ సినిమాల్లోనూ థమన్ పదనిసలు పరమానందం పంచుతున్నాయి. నేటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ థమన్ బాణీలతో సావాసం చేయాలని తపిస్తున్నారు. వారి ఇమేజ్ కు తగ్గ స్వరకల్పన చేయడంలో థమన్ బిజీ బిజీగా సాగుతున్నారు. తెలుగు సినిమా రంగం చూసిన చివరి బ్లాక్ బస్టర్ ఏది అంటే ‘అల…వైకుంఠపురములో’ పేరే వినిపిస్తుంది. 2020 […]
నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తాం. రైతుల పక్షాన పోరాడతాము అని బండి సంజయ్ అన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోంది. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రంలో ఆయన చెల్లిగా కీలక పాత్ర పోషించింది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్. ఆ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాగా, ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం 26న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సుధీర్ […]
భారత్‌లో కరోనా కేసులు కిందకు దిగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,07,617 శాంపిల్స్ పరీక్షించగా… 8,865 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 197 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 11,971 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,56,401 కు చేరగా.. ఇప్పటి వరకు 3,38,61,756 కోట్ల మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. […]
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కి ఉన్న కరోనా కారణంగా దానిని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచ కప్ 2022 నిర్వహించే వేదికలను ప్రకటిచింది. ఈ ప్రపంచ కప్ లో […]
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్లోన్ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రాప్ ఆధారంగా […]