నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను అందుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయాన్ని ఆసీస్ ఆటగాళ్లు తమ డ్రెసింగ్ రూమ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన కుడికాలు బూటు తీసి చేతిలో ఉన్న బీర్ ను అందులో పోసుకొని తాగాడు. ఆ తర్వాత ఆ జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అదే బూటులో బీర్ పోసుకొని తాగాడు. అయితే ఆ సమయంలో స్టోయినిస్ ను చూస్తే అతనికి దాని రుచి నచ్చలేదు అనేది అర్ధం అవుతుంది. అది తాగిన తర్వాత చెత్తగా ఉంది అని స్టోయినిస్ అన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ చేసింది.