హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి పై కసరత్తు తుది దశకు చేరిందా? రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థి పేరు ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోందా? అభ్యర్థి ఎంపికపై సర్వే రిపోర్థులతో స్పష్టత వచ్చినట్లేనా? హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు ఎవరెవరు రేసులో హుజురాబాద్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గం, స్థానికతపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కసరత్తు […]
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. క్రీడా గ్రామంలో పలువురు అథ్లెట్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో విశ్వక్రీడల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, ఒలింపిక్స్ నిర్వాహకులు అలాగే ముందుకు సాగుతున్నారు. ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ టీమ్ కి చెందిన ఇద్దరి ఆటగాళ్లు వైరస్ బారిన పడగా.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు […]
గుట్కా నిషేధించటం మంచి విషయమే. కానీ, ఈ నిషేధం సక్రమంగా అమలు కావటం అంత తేలిక కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోందట సాక్షాత్తూ పోలీసులే గుట్కా నిషేధానికి తూట్లు పొడుతున్నారట. అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారట.. తయారీకి, రవాణాకు సపోర్ట్ చేస్తున్నారట కొందరు కిందిస్థాయి అధికారులు. తెలంగాణలో గుట్కాని ప్రభుత్వం నిషేధించింది. అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తయారీదారులపై కూడా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గుట్కా తయారు […]
టీమిండియా మరో రికార్డు ముంగిట నిలిచింది. లంకపై అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు… ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలో భారత్ గెలిస్తే… ఆ లాంఛనం పూర్తవుతుంది. శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేకు సిద్దమయ్యారు. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెకండ్ వన్డే జరగనుంది. తొలి వన్డేలో లంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు… అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో […]
బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న […]
క్రికెట్‌లో క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. టీ 20 బ్లాస్ల్ క్రికెట్‌లో భాగంగా యార్క్‌షైర్, లంకాషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లంకాషైర్ ఇన్నింగ్స్‌లో లూక్ వెల్స్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న స్టీవెన్ క్రాప్ట్‌కు కాల్ ఇచ్చాడు. అయితే క్రాప్ట్ రన్ కోసం యత్నించి మధ్యలోనే పడిపోయాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్ నొప్పితో విలవిల్లాడాడు. అప్పటికే బాల్ కీపర్ హ్యారీ డ్యూక్ చేతిలోకి వచ్చింది. బ్యాట్స్‌మన్ రనౌట్‌కు అవకాశమున్నా […]
తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దాంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. లక్షా 35 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా లక్షా 59 వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 318.420 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 […]
ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్‌సైడర్ ట్రేడిరడ్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్‌స్టాప్ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి న్యాయపోరాటానికి ఆస్కారంవుండదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి రాజధాని భూములను టిడిపి పెద్దలు మంత్రులు వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో కొనేసి రైతులకు నష్టం కలిగించారనే ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్ ట్రేడిరగ్ అనే స్టాక్ […]
నాగోల్ అల్కాపురి లో గల టాటా షో రూమ్ లో మొదటి అంతస్తు నుంచి కారు కిందపడింది. కారును కొనుగోలు చేసింది మేడిపల్లి కి చెందిన భగవత్ అనే వ్యక్తి. మొదటి అంతస్తులో ఉన్న కారును హైడ్రాలిక్ సిస్టం పై కిందికి తీసుకొనివచ్చి కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇవ్వాలి షోరూమ్ సిబ్బంది. కానీ మొదటి అంతస్తులో ఉన్న కారును భగవత్ నడిపేందుకు షోరూం సిబ్బంది అనుమతి ఇచ్చారు. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి […]