ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్‌సైడర్ ట్రేడిరడ్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్‌స్టాప్ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి న్యాయపోరాటానికి ఆస్కారంవుండదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పటి నుంచి రాజధాని భూములను టిడిపి పెద్దలు మంత్రులు వారికి కావలసినవారు ముందస్తు సమాచారంతో కొనేసి రైతులకు నష్టం కలిగించారనే ఆరోపణ చేస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్ ట్రేడిరగ్ అనే స్టాక్ మార్కెట్ పదాన్ని తీసుకొచ్చారు.అమరావతిలో భూములను బడాబాబులు రియల్టర్లు ముందస్తుగా కొనుగోలు చేశారనే దాంట్లో సందేహమేమీ లేదు. ఆ మాటకొస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలోనే భూములు కొంటే తప్పేముందని సమర్థించారు. జయభేరి సంస్థ తరపున లోకేశ్ తరపున ప్రభుత్వం ప్రకటనలు కూడా చేసింది. చట్టపరంగా భూముల కొనడం తప్పుకాదన్నది వారి ప్రధాన వాదన. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని వస్తుందనేది చెప్పుకుంటూనే వున్నా ఖచ్చితంగా ఎక్కడ వస్తుంది, ఎక్కడ కీలకమైన నిర్మాణాలు వస్తాయనేది ప్రభుత్వంలో ఉన్నతవర్గాలకు మాత్రమే తెలుస్తుంది. మంత్రులు శాసనసభ్యులు చాలా మంది దాన్ని ఉపయోగించి విస్త్రతంగానే కొనుగోలు చేశారు. రాజకీయంగా నైతికంగా ఎవరి అభిప్రాయాలు ఏమైనా చట్టపరంగా అదితప్పు కాదనే భావన మాత్రం నిపుణులు చాలామంది వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే 2020 తర్వాత జగన్ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా కేంద్రీకరించింది. అక్రమ భూ కొనుగోళ్లను విచారించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.ఒక దశలో మాజీ ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్ భూమి కొనుగోళ్లు, వాటిని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ కుటుంబ సభ్యులు తర్వాత కొనడంపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టివేయడమే గాక ఆ వివరాలు ప్రచురించరాదని ఆంక్షలు పెట్టింది. ఆ పైన ముఖ్యమంత్రి జగన్ హైకోర్టుపైన ఫిర్యాదులతో పాటు జస్టిస్‌రమణపైనా ఆరోపణలతో అప్పటి సిజెఐ ఎస్‌ఎ బాబ్డేకు లేఖ రాయడం పెద్ద చర్చకు దారితీసింది.
ఇన్‌సైడర్ ట్రేడిరగ్‌పై విచారణను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాలు చేసింది. అలాగే మాజీ ఎజి కేసులో ఆంక్షలనూ సవాలు చేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ, ఇతర అంశాలపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. ఇప్పుడు విచారణ జరిపిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం ఇన్‌సైడర్ ట్రేడిరగ్ భావనను ప్రశ్నించింది, దీనిపై దుష్యంత్‌దవే మెహపూజ్‌్ నజ్కి వాదించారు.ప్రతివాదుల తరపున శ్యాం దివాన్, పరాస్ కుహాడ్, సిద్ధార్థ లూద్రా వాదించారు. ఏదైనా భూమిని కొనుగోలు చేసేప్పుడు అమ్మేవారికి పూర్తి సమాచారం ఇవ్వాలని గతంలో చాలా తీర్పులున్నాయని దవే వాదించారు. రాజధాని వస్తుందని దానివల్ల చాలా లాభం కలుగుతుందని చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు భూమిని తక్కువకు కొని లాభాలు పొందాలని చూశారని ఆరోపించారు. అయితే 14 గ్రామాలలో 50 వేల ఎకరాలకు రాజధాని వర్తిస్తుందని పత్రికలలో విస్తారంగా ప్రచురితమైందనీ, ఆస్తిబదలాయింపు చట్టం ప్రకారం ముందే చెప్పాల్సిన పనేమి లేదని శ్యాం దివాన్‌వాదించారు. ధర్మాసనం కూడా ముందస్తుగా చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిరది.2014లో ఈ లావాదేవీలు జరిగితే ఆరేళ్ల తర్వాత 2020లో కేసులు వేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వం మారినందున ఇది సాధ్యమైందని చెప్పిన పిటిషనర్ తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానం వాదనకు నిలవలేదు.హైకోర్టు అన్ని సాకల్యంగా పరిశీలించాకే తీర్పునిచ్చిందని దీనిలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పూర్తి తీర్పు తర్వాత ప్రకటిస్తామని చెప్పింది, వాస్తవానికి జస్టిస్‌రమణపైనా ఆరోపణలను అంతర్గత విచాం ణలో సుప్రీం కోర్టు కొట్టివేసినప్పుడే సుప్రీం కోర్టు మనోగతం విదితమైంది. బహుశా ఇప్పుడు విడిగా విచారణ జరుగుతున్న మాజీ ఎజి కేసులోనూ ఇదే విధమైన తీర్పు రావచ్చు.
బడాబాబులు ముందస్తు సమాచారంతో భూములు కొని లాభంపొందాలని చూసిన మాట, పొందిన మాల కూడా నిజమే అయినా దాన్ని ప్రస్తుత చట్టాల ప్రకారం తప్పుగా చెప్పడానికి లేదు. ఆ కారణంతో రాజధానిని అమరావతి నుంచి మార్చడం అసలే తర్కబద్దం కాదు. ఇప్పుడు కూడా హైకోర్టు ముందు వున్న మూడు రాజధానుల చట్టం విచారణతోనూ దీనికి సంబంధం లేదు.ఆ కేసు కూడా చాలా కాలం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపున అసైన్డ్ భూముల కొనుగోలుపై సిఐడి విడిగా విచారణ జరుపుతున్నది. ఈ కేసులో ఎవరూ ఫిర్యాదు చేయలేదని వచ్చిన వ్యాఖ్యల దృష్ట్యా ఆ కేసులో ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణరెడ్డి ద్వారా ఫిర్యాదులు తీసుకున్నారు. మామూలు భూముల కేసుకు అసైన్డ్ భిన్నమైనదని ప్రభుత్వం వాదించే అవకాశం వుంది. మొత్తంపైన సుప్రీం కోర్టు తీర్పు ముఖ్యఘట్టమైనా ఇంతటితోనే రాజధాని రాజకీయ వివాదాలు సమసిపోతాయని చెప్పడానికి లేదు. ఈ విధమైన తీర్పు వూహించిందేనన్నట్టుగా వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ఇప్పటివరకూ ఆ పార్టీనాయకులు ఎవరూ దీనిపై అధికారికంగా స్పందించలేదు కూడా.మరోవంక టిడిపి వర్గాలు మాత్రం దీనిపై ఎదురుదాడికి పెంచారు. బహుశా రానున్న రోజుల్లో ఈ వాదోపవాదాలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.