హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఇద్దరు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి పై కసరత్తు తుది దశకు చేరిందా? రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థి పేరు ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోందా? అభ్యర్థి ఎంపికపై సర్వే రిపోర్థులతో స్పష్టత వచ్చినట్లేనా? హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు ఎవరెవరు రేసులో హుజురాబాద్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గం, స్థానికతపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కసరత్తు తుది దశకు చేరిందని చర్చ సాగుతోంది. ఇక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందని అనేక సర్వేలు చేసిందట ఆశావహుల పేర్లు పరిశీలిస్తూ స్థానిక నేతలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం తీసుకుందట టిఆర్ఎస్ అధిష్టానం
పోటీలో నిలబెట్టే అభ్యర్థి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట అందుకోసమే అనేక మంది పేర్లు పరిశీలించిన తర్వాత, స్థానిక నేతల వైపు మొగ్గు చూపుతున్నారట కేసీఆర్. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గ నేత కాబట్టి, ఆ సామాజిక వర్గం నుండి ఎవరినైనా పోటీలో ఉంచాలని టిఆర్ఎస్ అధిష్టానం భావించిందట కానీ ఆ సామాజిక వర్గంలో బలమైన నేత లేకపోవడంతో పార్టీలో సీనియర్ బోయినపల్లి వినోద్ కుమార్ , కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యుల పేర్లతోపాటు , ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయట. వీరితో పాటు ఇతర జిల్లాలకు చెందిన బీసీ నేతల పేర్లు కూడా పరిశీలించిందట టియ్యారెస్ అధిష్టానం
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఇద్దరు మిగిలారనే టాక్ వినిపిస్తోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,ఎల్ రమణ పేర్లు తుది దశకు చేరాయట. ఈటెల రాజేందర్ పై బిసి నేత ని రంగంలోకి దింపాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. దానికోసమే హుజురాబాద్ కు చెందిన స్థానిక నేతలకు టిక్కెట్ ఇవ్వాలని కెసీఆర్ యోచిస్తున్నారని సమాచారం.
యాదవ సామాజిక వర్గానికి చెందిన టి ఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేరు టికెట్ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం బలంగా ఉండటంతో జగిత్యాల జిల్లాకు చెందిన రాష్ట్ర నేత ఎల్ ఎల్ రమణ ను రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే దానిపై కూడా లెక్కలు వేస్తున్నారట. ఈటల రాజేందర్ బిసి సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు కాబట్టి టిఆర్ఎస్ నుండి కూడా బీసీ నేతనే బరిలో దించితే గెలవచ్చనే ఊహాగానాలతో టిఆర్ఎస్ అధిష్టానం కసరత్తు సాగిస్తుందట.
ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ క్యాడర్, మంత్రులు ఎమ్మెల్యే లు, రాష్ట్ర నాయకులు పర్యటనలు చేస్తున్నారు. ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో అభ్యర్థి ఎంపిక త్వరగా ఫైనల్ అయితే పక్కా ప్రణాళికతో ముందుకు సాగవచ్చని టిఆర్ఎస్ క్యాడర్ భావిస్తుందట. దీంతో మరో నాలుగైదు రోజుల్లో అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?