బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ […]
కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయం అని కోవిడ్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన కొద్ది వారాల్లోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాతే వైరస్ తగ్గిందని చెప్పొచ్చు ఇప్పుడు తీటా, ఎప్సెలా అనే వెరియంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ కనిపిస్తోంది. విశాఖ, విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం […]
చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 41 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారం గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని సినీ ఫక్కీలో మలద్వారం లో దాచాడు కేటుగాడు. కానీ చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయటపడింది అక్రమ బంగారం రవాణా. 810 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన పై కేసు […]
తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. అయితే దీనిని భజరంగ్ ధళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బైపాస్ లలో 300, 500 చిల్లరకు ఆశపడి లారీలను వదిలేస్తున్నారు కొందరు పోలీసులు. పది గోవులు తరలించాల్సిన లారీలో 50కి పైగా తరలిస్తున్నారు అక్రమార్కులు. మెడలు విరిచి లారీలో కుక్కి అత్యంత క్రూరంగా తరలింపుకు యత్నం చేస్తున్నారు. ఊపిరాడక కొన్ని మూగజీవాలు అందులో చనిపోతున్నాయి. చంద్రగిరి, నిన్న తిరుచానూరులో లారీలను అడ్డుకున్న హిందూ సంఘాలు… అక్రమ రవాణాను అరికట్టాలని […]
హైదరాబాదులో ప్రముఖులకు కారు చిచ్చు తగిలింది. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కారులకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుండి కారులు దిగుమతి చేసుకునే రాయబారులకు పన్ను నుండి మినహాయిoపు ఉంటుంది. రాయబారులను ఆసరాగా తీసుకుని విచ్చలవిడిగా విదేశాల నుండి కార్లు దిగుమతి చేస్తుంది ముంబై మాఫియా. విదేశాల నుండి వస్తున్న కార్లు ముంబై నుండి మణిపూర్ లో ఓ మారుమూల షో రూంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రాయబారులు పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగొట్టెందుకు […]
సరూర్ నగర్ లో హైటెక్ తరహా లో పరీక్ష కాపీ కొడుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పరిక్ష రాసేందుకు ప్రయత్నం చేసి… అడ్డంగా బుక్ అయ్యాడు హర్యణా యువకుడు సౌరభ్. వాయుసేన లో ఎయిర్ మెన్ ఆన్ లైన్ పరిక్ష కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు సౌరభ్. అతనికి కర్మాణ్ ఘాట్ ఎస్ఈజెడ్ పరీక్ష కేంద్రం లో సెంటర్ పడింది. అయితే చెవికి రిసీవర్, బనియన్ కు ఎలక్ట్రానిక్ డివైస్ ను సౌరభ్ అమర్చాడు. సీసీ కెమెరాల్లో పరిక్షా […]
విపక్షంలో ఉన్న పార్టీ పుంజుకోవాలంటే నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. కానీ, బెజవాడ టిడిపిలో ఇది రివర్స్ లో ఉందట.. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మొదలైన కలహాలు ఇంకా కొనసాగుతున్నాయట.. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్నారట. నేతల మధ్య పోరుతో కేడర్ అయోమయంలో పడుతోందట.. బెజవాడ టిడిపిలో కలహాల కాపురం సాగుతోంది. నేతల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన కలహాలు కార్పొరేషన్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న […]
తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 18°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నది. జులై 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు వున్నవి. […]