టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. క్రీడా గ్రామంలో పలువురు అథ్లెట్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో విశ్వక్రీడల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, ఒలింపిక్స్ నిర్వాహకులు అలాగే ముందుకు సాగుతున్నారు. ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ టీమ్ కి చెందిన ఇద్దరి ఆటగాళ్లు వైరస్ బారిన పడగా.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 58 మంది క్రీడా సంబంధిత వ్యక్తులకు కొవిడ్-19 సోకిందని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు.