భారత్ లో కరోనా కేసులు నేడు తగ్గాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 30,093 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,74,322 కి చేరింది. ఇందులో 3,03,53,710 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,06,130 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 374 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు […]
నిన్న తిరుమల శ్రీవారిని 17073 మంది భక్తులు దర్శించుకోగా 8488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.7 కోట్లు. అయితే నేటి నుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేయనుంది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ పెంచలేదు. ఇక […]
తమిళ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. అక్కడ ధనుష్ కథానాయకుడు కాగా, ఇక్కడ వెంకటేశ్ హీరోగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను దీన్ని నిర్మించారు. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయాలని మొదట భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో తప్పని స్థితిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీలో […]
చెన్నైలో వేటకు వెళ్లి గల్లంతైన సిక్కోలు మత్స్యకారుల ఆచూకీ లభ్యం అయ్యింది. మత్స్యకారులు సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబసభ్యులు. రామయ్యపట్నం – చెన్నై మధ్యలో మత్స్యకారుల బోటును గుర్తించారు కోస్ట్ గార్డు. ఆ తర్వాత మత్స్యకారుల బోటును కొంతమేర వరకూ తీసుకొచ్చిన కోస్టుగార్డు బోటు… చెన్నైకు చెందిన ఎస్.కె.టి కంపెనీకి చెందిన మరో మత్స్యకార బోటుకు అనుసంధానం చేసారు. మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాకొస్తుంది ఎస్.కె.టి కెంపెనీకి చెందిన ఫిషింగ్ బోటు. ఈ రాత్రికి వారు చెన్నైలోని […]
శ్రీశైలం జలాశయానికి వరద వరద ఉధృతి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,64,645 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 833.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 53.1795 టీఎంసీలు ఉంది. […]
గత రెండు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,000 కి చేరింది. ఇక 10 […]
నామినేటెడ్ పోస్టుల పందేరం ముగియడంతో ఎమ్మెల్యేల ఫోకస్.. కేబినెట్ బెర్త్‌లపై పడింది. రెండున్నరేళ్ల ప్రక్షాళన గడువు దగ్గర పడేకొద్దీ.. తాడేపల్లి వైపు ఆశగా చూస్తున్నారు. కేబినెట్‌లో ఉన్నవారు టెన్షన్ పడుతుంటే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ అంశమే హాట్ టాపిక్. తాడేపల్లి వైపు ఆశగా చూస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 చోట్ల గెలిచింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇద్దరికి జిల్లా […]
నిన్నమొన్నటి వరకు వారిద్దరూ ప్రత్యర్థులు. ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నారు. చేరికలు సంతోషాన్నిచ్చినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం టెన్షన్ పడుతున్నారట. పరిస్థితిని గమనించిన కేడర్.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా లేదా అని చర్చించుకుంటోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ? టెన్షన్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్ రమణ.. టీ టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జగిత్యాల నియోజకవర్గంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. రమణకు టీఆర్‌ఎస్ కండువా కప్పిన […]
జమ్మలమడుగు వైసీపీలో నేతల మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చిందా? పార్టీ పెద్దల సంతృప్తి కోసమే చేతులు కలిపారా? నాయకుల మధ్య వైరం అలాగే ఉందా? కొత్త రగడ పార్టీలో కాక రేపుతోందా? ఆ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కష్టమేనా? లెట్స్ వాచ్! ఇద్దరి మధ్య సఖ్యత కష్టమేనా? కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన జమ్మలమడుగులో 2019 ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వైసీపీలో చేరిన తర్వాత నియోజకవర్గంపై […]