ఢీల్లి నుంచి ప్రత్యేక విమానంలో టోక్యోకు వెళ్లారు భారత అథ్లెట్లు. ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతుండటంతో భారత అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దిల్లీ నుంచి బయలుదేరుతుండంగా పతకాలతో తిరిగి రావాలని అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారత షూటర్లు నిన్న ఉదయమే టోక్యోకు చేరుకున్నారు. క్రొయేషియా నుంచి భారత షూటర్లు వెళ్ళడంతో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఢీల్లి నుంచి బయలుదేరిన భారత అథ్లెట్ల బృందం మాత్రం మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో […]
టోక్యో ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కలకలం రేపింది. నేడు నిర్వహించిన కరోనా పరీక్షలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఒలంపిక్స్ విలేజ్ లో నిన్న తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఈరోజు అక్కడ అందరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇద్దరికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇక ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రతిరోజు క్రీడాకారులకు […]
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ ఉంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,157 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 518 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 42,004 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,06,065కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,02,69,796కి పెరిగాయి… […]
భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే…మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి. […]
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా ఏ క్షణంలో అయినా జంట జలాశయాల గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785 అడుగులకు నీరు వచ్చి చేరింది. ఇక హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 కాగా 1762 కు నీరు వచ్చి చేరింది. మరో రెండు రోజులు ఏగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే జంట జలాశయాల […]
కుప్పంలో టెన్షన్ వాతారవరణం నెలకొంది. కుప్పంలో ఇవాళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ర్యాలీకి పిలుపునిచారు బలిజ సామాజిక వర్గం నేతలు. కానీ ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని బలిజ సామాజిక వర్గ పెద్దలు ప్రకటించారు. దాంతో గత రాత్రి నుంచి ముఖ్య నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఉంచిన శ్రీ మంజునాథ రెసిడెన్సి వద్ద 50 మందికి పైగా పోలీసులను మోహరించారు. […]
నకిలీ డీఎస్పీ దందాలపై పోలీసుల విచారణ ముమ్మరం చేసారు. నిన్న హైదరాబాద్ పోలీసులు ఓ నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసాడు బీబీపేట మండలం,తులాజ్ పూర్ కి చెందిన నెల్లూరు స్వామి. అయితే తాను ఓ పోలీస్ అధికారిగా చెప్పుకొంటూ సెటిల్ మెంట్లు, వసూళ్లకు పాల్పడినట్లు నిర్దారణ అయ్యింది. పోలీస్ శాఖలో ఎవరు సహకరించారు, అతని వెనుక ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరూ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. […]
శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. నేడు జూరాల నుండి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 85,098 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 7,063 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 816.10 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 38.0672 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు […]