ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు టిక్కెటిస్తాం అంటే నాయకులెవరైనా ఎగిరి గంతేస్తారు..కానీ ఈ కాంగ్రెస్ నేత మాత్రం హుజూరాబాద్ లో పోటీకి నో అంటున్నారట. పోటీ చేసేది లేదంటే లేదని తేల్చేశారట. ఈ మాజీ ఎంపీ పోటీచేయనని చెప్పటానికి కారణం ఏంటి? హుజూరాబాద్ అభ్యర్ధి కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వేట మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఈ పనిలో వ్యూహరచన చేస్తుంటే, కాంగ్రెస్ ఈ కసరత్తులో కొంత వెనుకబడింది. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధి […]
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,280 సాంపిల్స్ పరీక్షించగా.. 2,527 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,412 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,09,613 కి చేరింది.. […]
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయు. మొదటి విడతలో గొర్ల కాపర్లకు రూ. 5 వేల కోట్లతో 3లక్షల 71 వేల మందికి గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అని టీఆర్ఎస్, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో డీడీలు కట్టిన […]
హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయొచ్చు. నెరవేర్చటం మాత్రం అంత ఈజీ కాదు. ఇది సామాన్యులకే కాదు.. నేతలకు కూడా అనుభవమే అవుతోంది. ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టిడిపి నేతలకు మరింత ఎక్కువగా తెలుసట. అందుకే… కమలం పార్టీ తమకు పెద్దగా వర్కవుట్ కాలేదని భావిస్తున్నారట. కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? ముఖ్యంగా ఇతర పార్టీ ల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారా? ఇదే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో […]
ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచుతూ జీఓ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ పెంచారు. ప్రభుత్వానికి భూముల మార్కెట్ విలువ పెంచడం ద్వారానే ఆదాయం వస్తుంది. కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ ఎందుకు పెంచారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజల పై ఆర్థిక భారం పడుతుంది. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ చార్జీలు వెంటనే తగ్గించాలి. తెరాస అధికారం లోకి […]
తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును రట్టు చేసారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో రహస్యంగా వ్యభిచార దందా కొనసాగుతుంది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసి నలుగురు విటులను అలాగే నిర్వాహకులను అరెస్టు చేసారు. దీని నిర్వహిస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించారు. యువతుల ఫొటోలను సాయిచరణ్, […]
కిడ్ని సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి వచ్చిన వి.హనుమంతరావును హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు పరామర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం సిమ్లా గవర్నర్గా ఉన్న నేను హనుమంతరావు గారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారని మీడియా ద్వారా తెలుసుకున్నాను.. ఆ తర్వాత హర్యానా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీలు చూసుకొని హనుమంతరావు […]
శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ నుండి వచ్చిన వరద కారణంగా పెరిగిన ఇన్ ఫ్లో ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 45,111 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గానే ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 842.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం […]