విజయ దశమి సమయంలో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. 24,25 జిల్లాలో పార్టీ కార్యాలయల నిర్మాణం పూర్తి అయ్యింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంకు వచ్చే నెల 2న కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుంది అని అన్నారు. భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు అవుతారు అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న 12 వేళ 769 గ్రామ కమిటీల నిర్మాణము, 3854 వార్డు […]
నేడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామంలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రేవంత్ మాట్లాడుతూ… పేదల ఇండ్లు కట్టిస్తా అని ముల్క నూరులో ఇప్పటికీ ఇండ్లు కట్టించ లేదు. ఆడపిల్ల ల ఆత్మగౌరవం పోతుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం. 150 మంది ఇంకా రోడ్డు మీద బతుకుతున్నారు. లక్ష్మ పూర్ కి దరని వెబ్ సైట్ లో గుర్తింపే లేదు. కేశవరం లో డబుల్ బెడ్ రూం ఇచ్చినవా… డబుల్ […]
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,890 సాంపిల్స్ పరీక్షించగా.. 1,248 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,715 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,04,590 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,77,163 కి […]
ఏపీలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షలు కురిసే అవకాశం ఉంది. 10°N అక్షాంశము వెంబడి తూర్పు-పడమర ‘షీర్ జోన్’ సగటు సముద్ర మట్టానికి 4.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు […]
ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జార్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం… ఈ నెల 13 తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పని సరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ […]
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మరియు కాలేజ్ పిల్లలకు ఆట స్థలం క్రింద ఉన్న ఒకే ఒక్క స్థలంలో ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దాంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు పాఠశాలల విద్యార్థులు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి… చుట్టుపక్కల రెండు మూడు ఊర్లలో ఒక్క గ్రౌండ్ కూడా లేదు. మాకు ఈ ఒక్క గ్రౌండ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కోల్డ్ […]
కన్నడ డ్రగ్స్ కేస్ లో హీరోయిన్ లకు ఉచ్చు బిగుస్తుంది. రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు బెంగుళూరు పోలీసులు. వాటిని పరీక్షించిన తర్వాత ఇద్దరు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పేర్కొంది. మొదట బ్లడ్, యూరిన్ నమూనాలను యాక్టర్ నుండి సేకరించి పోలీసులు ల్యాబ్ కు పంపగా… వాటిలో ఫలితం సరిగ్గా తేలకపొడంతో వెంట్రుకల నమూనాలను సేకరించారు. హైదరాబాద్ […]
వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం […]
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను అరెస్ట్ చేసారు. అతడిని బెంగుళూరులో అరెస్ట్ చేసారు విజయవాడ పోలీసులు. రాహుల్ హత్య కేసులో ఏ2 గా ఉన్నాడు కోగంటి. […]
అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మంది దగ్గర 6500 కోట్లు వసూలు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించారు. చంద్రబాబు ఉన్నప్పుడు సంస్ధను ప్రారంభించారు… చంద్రబాబు ప్రభుత్వం లోనే అగ్రిగోల్డ్ కుంభ కోణం బయటపడింది అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3500 కోట్లు అగ్రిగోల్డ్ డబ్బులు దోచుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హయ్ ల్యాండ్ మీద కన్నేశారు. […]