60 లక్షల విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు : సబితా ఇంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంగన్ వాడీ స్కూల్స్ కూడా ప్రారబిస్తున్నాం. డీఈవోలు అందర్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. సర్పంచ్, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్, మేయర్లు అందరూ బాధ్యతగా తీసుకోవాలి అని అన్నారు.
ఇక ప్రతిరోజూ పాఠశాలల్లో ఏఏ పనులు చేశారో రాష్ట్ర అధికారులకు నివేదిక ఇవ్వాలి. కోవిడ్ పాజిటివ్ వస్తే టెస్టు లు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే పాఠశాలల నిర్వహణ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ట్రాన్స్ పోర్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ బస్ సానిటైజ్ చేయాలి. ఆటోల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లల ట్రాన్స్ పోర్టు ఉండాలి. అధికారులు అందరూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాలి. ప్రత్యక్ష తరగతులు మాత్రమే నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు మమ్మల్ని స్కూల్స్ ప్రారంభించాలని కోరుతున్నాం. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సుల కండీషన్లు చూసుకోవాలి అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!