శ్రీకాకుళం సున్నాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు పోలీసులు సిబ్బంది మరణించారు. మృతుల్లో ఒక ఏఎస్ఐ , ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ , డ్రైవర్ ఉన్నారు. మందసలో ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీపు ఫ్రంట్ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది జీపు. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులలో కృష్ణుడు( ఏఎస్ఐ) , ఆంటోని( హెచ్.సీ) , […]
10°N అక్షాంశము వెంబడి తూర్పు-పడమర ‘షీర్ జోన్’ 5.8 km ఎత్తు వద్ద కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే […]
కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై దేశ వ్యాప్తంగా సర్వే చేసింది. దేశంలోనే అన్ని నగరాల్లో స్వచ్ఛ భారత్ కింద వ్యర్ధాల మేనేజ్మెంట్ లో సర్వే చేశారు. 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే రాష్ట్రం నుండి 3 నగరాలు ఎంపిక అయ్యాయి అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కు ఎంపికయ్యాయి. అన్ని పట్టణాలను ఇలానే తయారు చేయాలని సీఎం ఆదేశించారు. టీడ్కో […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో మీరంత పాల్గొనాలి, మూడు మొక్కలు నాటి, నాకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరు ట్వీట్ […]
తెలంగాణ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలి. ధరల పెరుగుదల పై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయండి అని ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ అన్నారు. రాజకీయంగా ఎదగడానికి పనిచేస్తుంది. కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నాడు. రాజకీయ లబ్ధికోసమే దళిత బంధువు.. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. దళితలకు 3ఎకరాల భూమి ఏమైంది. దళిత బంధు కాదు.. బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలి. బీజేపీ […]
కలిసి పనిచేస్తేనే పార్టీ అయినా.. మరేదైనా సక్సెస్ అవుతుంది. కానీ.. అక్కడ ఆ నేతలు ఎక్కువగా వన్ మ్యాన్ షో చేస్తుంటారు. ఎవరికి వారే మైలేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఇంకొకరికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా మారని ఆ నేతలతో ఆ పార్టీ కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. వర్గాలుగా విడిపోయిన తిరుపతి బీజేపీ.. ఎవరి శిబిరం వారిదే! ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా బీజేపీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి. […]
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌కు చీఫ్. అక్కడ పార్టీకి పెద్ద అయినా.. కేడర్‌తో అంతులేని గ్యాప్ ఉందట. ఇప్పుడు అది కాస్తా ఓపెన్ అయిపోయింది. నేరుగా పీసీసీ చీఫ్‌కే ఫిర్యాదులు చేసేవరకు వెళ్లిందట. దీంతో పార్టీవర్గాల్లో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై వ్యతిరేకవర్గం గుర్రు! తూముకుంట నర్సారెడ్డి. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి కాంగ్రెస్ […]
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్ లో 370 కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం..దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం..నా జీవితంలో ఇది కీలక నిర్ణయం.. క్యాబినెట్ మంత్రిగా నాకు మోడీ అవకాశం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు […]
కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్ […]