శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అధికారులు దీన్ని బాగా వంటబట్టించుకున్నారు. ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికివారు జాగ్రత్త పడుతున్నారట. తప్పించుకునే మార్గాల అన్వేషనలో క్షణం తీరిక లేకుండా ఉన్నట్టు టాక్. వారెవరో ఇప్పుడు చూద్దాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని పెద్ద పనోళ్లపై చర్చ! గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గత దశాబ్దకాలంగా అక్రమ కట్టడాలకు అడ్డదిడ్డంగా అనుమతి ఇచ్చేశారు అధికారులు. ఇప్పుడా అక్రమాలను తవ్వి తీసే పనిలో పడింది ప్రభుత్వం. దాంతో ఆ అవినీతితో […]
సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. చిత్రంలోనిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉండగా నేడు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాన్ వచ్చారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ… సుశాంత్ ఈ సినిమా చేస్తున్నట్లు నాకు ”అల వైకుంఠపురములో” సినిమా షూటింగ్ సమయంలో […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 389 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 420 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,732 కు చేరగా.. రికవరీ కేసులు 6,45,594 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య […]
ఆ ఇద్దరి మీదా విచారణ ఉంటుందని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఇది ప్రభుత్వం అధికారిక వైఖరా? లేదా వాసిరెడ్డి పద్మ వ్యక్తిగత అభిప్రాయమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అధికార వైఖరి అయితే ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గానే పట్టించుకుంటోందని అనుకోవాలి. ఇద్దరు ముఖ్యల మీద ఆడియో టేపులు బయటపడటం సంచలనం! ఏపీలో ఇద్దరు అధికార ప్రజాప్రతినిధుల ఆడియో టేప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరూ ప్రముఖులు కావడం.. […]
ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చాలా ప్రసిధ్ది. దేశంలోని నలుమూలలకు ఢిల్లీ నుంచే డ్రై ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. ఆప్ఖనిస్తాన్ తో భారత్ దేశం సుమారు ( 400 మిలియన్ అమెరికన్ డాలర్లు) 4 వేలకోట్ల రూపాయల మేరకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు భారత్ ఓ పెద్ద మార్కెట్. పాత ఢిల్లీలోని, జమా మసీదు సమీపంలో “ఖారీ బావ్లీ” ప్రాంతంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయు. ఆప్ఘనిస్తాన్ […]
రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారం లో మండల కమిటీలు, మూడో వారం లో జిల్లా కమిటీలు.. అలాగే అక్టోబర్ లో రాష్ట్ర కమిటీ లు పూర్తిచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. దళిత బందు పై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుంది. అన్ని వర్గాలకంటే దళితులు వెనుకపడ్డారు కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తెచ్చాము. అన్ని వర్గాలకు న్యాయం […]
మాట మీరినా.. మాట తూలినా.. మటాషే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ట్రెండే నడుస్తోంది. పీసీసీకి కొత్తచీఫ్ వచ్చాక క్రమశిక్షణ కమిటీ కఠినంగా ఉంటోంది. కాకపోతే ఇప్పటివరకు వేటు పడ్డవారి గురించే చర్చ. వారంతా ఓ నేత వర్గమట. అందుకే వేటు వెనక కథేంటని చర్చించుకుంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కొత్త చీఫ్ హయాంలో వేటుపడ్డవారి గురించి కాంగ్రెస్‌లో చర్చ! కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎవరినైనా తిట్టేయొచ్చు. అది పార్టీ వేదికైనా.. పార్టీ ఆఫీసైనా..! రాహుల్, సోనియాగాంధీలను తప్పించి.. […]
కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాలలోనూ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. తమిళనాడు లాంటి చోట్ల 23 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకున్నాయి. ఏపీలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదీ రోజుకు మూడు ఆటలతోనే! చిత్రం ఏమంటే… జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఏదీ ఇంతవరకూ విడుదల కాకపోవడంతో తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినా… చాలా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. జంట థియేటర్లు ఉన్న […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గంగపుత్రుల ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సభలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గంగ పుత్రుల ఏకగ్రీవ తీర్మాణం చేసారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 25,116 అందజేశారు గంగ […]
ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టే తిరుగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ విషయంలో పెద్ద సస్పెన్స్ ఏమీ లేదు ..కానీ కాంగ్రెస్‌లోనే ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి ఎవరని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే, కొండా సురేఖ పేరు ఖరారు అయిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందటమే ఆలస్యమట. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ మూడు పేర్లతో హైకమాండ్‌కు నివేదిక […]