చాలా కాలం వేచి చూసిన తర్వాత వారికి అధికార యోగం పట్టింది. పాలకవర్గంలోకి ఇలా వచ్చారో లేదో పెత్తనం చేయడం మొదలు పెట్టారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధుల దూకుడుకు కళ్లెం వేయడం అధికారులకు సవాల్‌గా మారిందట. వారెవరో ఏంటో లెట్స్ వాచ్! కొందరు కార్పొరేటర్లు సర్వ అధికారాలు ఉన్నాయని ఫీలవుతున్నారా? పదేళ్లకుపైగా ప్రత్యేక అధికారి పాలనలో సాగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో 98 డివిజన్లకు ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరింది. […]
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్ పైనే ఉంది. అయితే తాలిబన్ల సమస్యతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ కు ఆఫ్ఘన్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీలో ఆ జట్టు పాల్గొంటుందా.. లేదా అని అనుకుంటున్న సమయంలో తాలిబన్లు అందరికి షాక్ ఇచ్చారు. తాజాగా ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలాగే క్రికెట్ బోర్డు సభ్యులతో తాలిబన్ అధ్యక్షుడు […]
ఆ ఒక్క ఉపఎన్నిక.. అధికారపార్టీలోని మిగతా ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నిధుల కోసం నియోజకవర్గం దాటి ప్రభుత్వ పెద్దల దగ్గర క్యూ కట్టక తప్పడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ ఫీట్లు.. ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చగా మారాయి. ప్రభుత్వ పెద్దల దగ్గరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ! హుజురాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ పూర్తిగా ఫోకస్ పెడితే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారిని ఇరుకున పెట్టే వర్గాలు […]
తిరుమలలో ఆన్ లైన్ టిక్కెట్లు కేటాయింపులో గందరగోళం నెలకొంది. టీటీడీ కాల్ సెంటర్ కి భక్తుల ఫిర్యాదుల తాకిడి పెరుగుతుంది. సెప్టెంబర్ మాసంకు సంభందించిన 2 లక్షల 40 వేల… 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును నిన్న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ప్రకటించింది టీటీడీ. 9.30 గంటల వరకు సైట్ ఒపెన్ కాలేదంటు భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. 9.30 గంటలకే 90 శాతం టిక్కెట్లు విక్రయాలు పూర్తి […]
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు నకిలీ ఈడి నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేస్తామంటూ ఈడి పేరుతో నకిలీ నోటీసులు పంపారు ఆగంతకులు. దాంతో ఈడి అధికారులని సంప్రదించారు మంత్రి గంగుల కమలాకర్. నకిలీ నోటీసుల పై సైబర్ క్రైమ్ పోలీసులుకు ఈడి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై 420,468,,471 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. దర్యాప్తు లో భాగంగా మంత్రి గంగులకు పోలీసులు ఫోన్ చేయగా నకిలీ నోటీసులు పై ఫిర్యాదు […]
నిన్న ఆపఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తరలించిన 78 మందిలో 16 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా, మొత్తం 78 మందిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. తాలిబాన్ ల ఆక్రమణ తర్వాత మరింత దిగజారుతుంది అక్కడి భద్రతా పరిస్థితి. భారత్ పౌరులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ ను వీడిపోవాలనుకుంటున్న ఆదేశ పౌరులను సైతం తరలించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది భారతదేశం. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి 228 మంది భారతీయ పౌరులతో […]
హైదరాబాద్ లో గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కు నేటి తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్ లో జంట పేలుళ్లు జరిగాయి. జంట పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు. 14 ఏళ్ళు అయిన ఇంకా ఆ రక్త మరకలు మారలేదు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష […]
ఈరోజు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 4,5,6,9,10 తేదీల్లో జరిగాయి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు. ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఎంట్రెన్స్ కి 90 శాతం హాజరు అయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి లక్షా 64 వేల 964 మంది దరఖాస్తు చేసుకుంటే లక్ష 47 వేల 986 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఎంసెట్ అగ్రికల్చర్ ,మెడికల్ స్ట్రీమ్ కి 91.19 శాతం ఉపస్థితి […]
ఏపీలో జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.15,000 ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ధారించింది. ఇక మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500 ఇతర గ్రూపులకు రూ.15,000 గా… అలాగే కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000 ఇతర గ్రూపులకు రూ.18,000 గా స్పష్టం చేసింది. అయితే కరోనా కారణంగా గత […]
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా… తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజినల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రసారం చేయనుంది. ఆహా కిడ్స్ ద్వారా మన పురాణ కథలు, విలువలును తెలియజేసేలా పలు ఒరిజినల్స్‌ను ఈతరం చిన్నారులకు అందిస్తోంది. ‘మహా గణేశ’ వెబ్ యానిమేటెడ్ ఒరిజినల్‌ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రై. లి. కలయికలో రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ వ్యవధి 15 […]