సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. చిత్రంలోనిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉండగా నేడు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాన్ వచ్చారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ… సుశాంత్ ఈ సినిమా చేస్తున్నట్లు నాకు ”అల వైకుంఠపురములో” సినిమా షూటింగ్ సమయంలో చెప్పినట్లు… అలాగే తర్వాత తాను ఈ సినిమా గురించి బయట చాలా వినట్లు తెలిపారు. ఈ సినిమాలో అందరూ చాలా అద్భుతంగా నటించినట్లు పేర్కొన మాటల మాంత్రికుడు అభినవ్ గోమఠం తన ఫెవరెట్ యాక్టర్ అని అన్నారు. అయితే మీరు ఎప్పుడైనా చలానా కట్టారా అని సుమ అడిగిన ప్రశ్నకు… నేను కట్టలేదు కానీ ఈ సినిమా విడుదల రోజు ప్రజల చేత రూ.150 చలానాలు కట్టించండి అని సరదాగా అన్నారు. అలాగే ఈ సినిమా దర్శకుడికి మరియు ఇందులో పని చేసిన అందరికి అభినందనలు తెలిపారు. ఇక ఈ సినిమా పెద్దహ్ హిట్ కావాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ చిత్రానికి ‘దర్శన్’ దర్శకత్వం వహించగా, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి మరియు హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.