ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్ పైనే ఉంది. అయితే తాలిబన్ల సమస్యతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ కు ఆఫ్ఘన్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీలో ఆ జట్టు పాల్గొంటుందా.. లేదా అని అనుకుంటున్న సమయంలో తాలిబన్లు అందరికి షాక్ ఇచ్చారు. తాజాగా ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలాగే క్రికెట్ బోర్డు సభ్యులతో తాలిబన్ అధ్యక్షుడు చర్చలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ సమయంవేశంలో.. మేము మీకు సహాయం చేస్తామని… స్వేచ్ఛగా క్రికెట్ ఆడండి అని తాలిబన్ అధ్యక్షుడు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే తాలిబాన్లకు కూడా క్రికెట్ అంటే ఇష్టమని…. గతంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను పాలిస్తున్న సమయంలోనే ఆ దేశంలో క్రికెట్ ప్రారంభం కావడం గమనార్హం.