తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు నకిలీ ఈడి నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేస్తామంటూ ఈడి పేరుతో నకిలీ నోటీసులు పంపారు ఆగంతకులు. దాంతో ఈడి అధికారులని సంప్రదించారు మంత్రి గంగుల కమలాకర్. నకిలీ నోటీసుల పై సైబర్ క్రైమ్ పోలీసులుకు ఈడి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై 420,468,,471 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. దర్యాప్తు లో భాగంగా మంత్రి గంగులకు పోలీసులు ఫోన్ చేయగా నకిలీ నోటీసులు పై ఫిర్యాదు చేయలేదు మంత్రి గంగుల కమలాకర్.