ఈరోజు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 4,5,6,9,10 తేదీల్లో జరిగాయి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు. ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఎంట్రెన్స్ కి 90 శాతం హాజరు అయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి లక్షా 64 వేల 964 మంది దరఖాస్తు చేసుకుంటే లక్ష 47 వేల 986 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఎంసెట్ అగ్రికల్చర్ ,మెడికల్ స్ట్రీమ్ కి 91.19 శాతం ఉపస్థితి అయ్యారు. 86 వేల 642 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 79 వేల 010 మంది విద్యార్థులు ఎంట్రెన్స్ రాసారు.