ఆహా లో వినాయక చవితి రోజున ‘మహా గణేశ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా… తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజినల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రసారం చేయనుంది. ఆహా కిడ్స్ ద్వారా మన పురాణ కథలు, విలువలును తెలియజేసేలా పలు ఒరిజినల్స్‌ను ఈతరం చిన్నారులకు అందిస్తోంది. ‘మహా గణేశ’ వెబ్ యానిమేటెడ్ ఒరిజినల్‌ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రై. లి. కలయికలో రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ వ్యవధి 15 నిమిషాలుంటాయి. ఇది మన దేవతల్లో ప్రథమ పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి సంబంధించిన పండుగ వినాయక చవితి పురాణాన్ని తెలియజేస్తుంది. వినాయకునికి ఏనుగు తలను ఎందుకు పెట్టారు, అలాగే తన తమ్ముడు కార్తికేయతో గణేశుడు ఎందుకు పోటీ పడి మూడుసార్లు మూల్లోకాలను ప్రదక్షిణాలు చేశారు. చంద్రుడికి, వినాయక చవితినాడు ఎందుకు శాపం పెట్టారు, రాక్షసరాజు గజాసురుడిని వినాయకుడు మధ్య యుద్ధం తదితర విషయాలన్నీ ఈ వెబ్ సిరీస్‌లో కథలాగా పొందుపరిచారు.
‘మహా గణేశ’ను కౌశిక్ కర్ర రచించగా, శ్రీనివాస శర్మా రాణి సంగీతాన్ని అందించారు. జి. డి. ఆర్. మోహన్, ఎ. గంగరాజ్ చరణ్ యానిమేషన్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. టి.ఎ.కె. కుమార్ ఈ షోకు వాయిస్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘మహా గణేశ’ తొలి పోస్టర్, సాంగ్‌ను మంగళవారం రాజీవ్ చిలక(గ్రీన్ గోల్డ్ యానిమేషన్, సి.ఇ.ఓ), అజిత్ ఠాకూర్ (ఆహా, సి.ఇ.ఓ) విడుదల చేశారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్‌డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?