‘శ్రీరస్తు… శుభమస్తు…’ అన్న పదాలు మనవాళ్ళకు మహదానందం కలిగిస్తాయి. ముఖ్యంగా శుభలేఖల్లోనూ ఈ పదాలు ప్రధానస్థానం ఆక్రమిస్తుంటాయి. శుభకార్యాల్లోనూ ఈ పదాలే జనానికి ఆనందం పంచుతూ ఉంటాయి. ‘శ్రీరస్తు-శుభమస్తు’ టైటిల్ తో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం 1981 సెప్టెంబర్ 26న విడుదలయింది. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యువతను అప్పట్లో ఆకట్టుకుంది. ఇదే టైటిల్ తో ఈ మధ్య చిరంజీవి మేనల్లుడు అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం రూపొందింది. ‘శ్రీరస్తు-శుభమస్తు’ కథలో […]
మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ కోత సినిమా ‘రిపబ్లిక్’ అక్టోబర్ 1న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ… తేజ్ కు ప్రమాదం జరిగిన సమయంలో అభిమానులు స్పందించిన తీరుతో వారంతా మళ్ళీ సినిమాకు ఏ కులం, జాతితో సంభంధం లేదని నిరూపించారని తెలిపారు. […]
ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోందా? ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? ముందుగా అనుమానాస్పద అధికారులపై ఫోకస్ పెట్టిందా? ఆఫీసర్ల చెక్‌లిస్ట్ సిద్ధం చేస్తోందా? ఆ జాబితాలోకి వచ్చే అధికారులను ఏం చేస్తారు? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికారులకు ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆరా..!? ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. క్రమంగా ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్తున్నారు సీఎం జగన్. మంత్రులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం […]
కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయా? సమన్వయం లేక నాయకులే బజారున పడుతున్నారా? ఆధిపత్యపోరు వైఎస్ విగ్రహాన్ని కూల్చేవరకు వెళ్లిందా? లోకల్ సెగలు.. ఇంకెలాంటి మలుపు తిప్పుతాయో పార్టీ వర్గాలకు బోధపడటం లేదా? ఏ విషయంలో పార్టీ నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది? లెట్స్ వాచ్! కోడుమూరు వైసీపీలో వర్గపోరు సెగలు..! కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడది పరిషత్ ఎన్నికల […]
ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు పంజాబ్ బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. నిర్ణిత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్న పంజాబ్ జట్టులో ఎవరు చెప్పుదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ జట్టులో ఐడెన్ మార్క్రమ్(27) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా […]
వైద్యశాఖలో అంతా గందరగోళమే. ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు. దీనికితోడు ఇంఛార్జుల పాలన. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తిస్థాయి అధికారులు రారు. వ్యవస్థ మొత్తం డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి. కీలకమైన వైద్య విభాగంలో ఎందుకిలా జరుగుతోంది? వైద్యశాఖలో ఇంఛార్జుల పాలన..! విభజన చట్టం ప్రకారం తెలంగాణ వైద్యశాఖలో చర్యలు తీసుకోలేదు. దీంతో పరిపాలనా విభాగాలలో ఇంఛార్జుల కాలం నడుస్తోంది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ యూనివర్సిటీ వీసీ, నర్సింగ్ రిజిస్ట్రార్, నిమ్స్ డైరెక్టర్‌లు అనేక సంవత్సరాలుగా కుర్చీలను వదలటం […]
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,702 శాంపిల్స్ పరీక్షించగా.. 248 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్‌బారినపడి మృతిచెందగా.. 324 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898కు చేరగా.. రికవరీ కేసులు 6,56,285కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,912 మంది ప్రాణాలు […]
వీకెండ్ సందర్భంగా ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతుండగా.. అందులో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగగా… అందులో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన రాజస్థాన్ మొదటి నుండి తడబడింది. పవర్ ప్లే లోనే వరుస వికెట్లు […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ లలో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని అనుకుంటుంది. అలాగే పాయింట్స్ టేబుల్ లో ఆఖరి నుండి రెండో స్థానంలో […]
రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంచేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధంచేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తుపాను అనంతర […]