చూస్తే భూమికి ఐదున్నర అడుగుల ఎత్తున పీలగా కనిపిస్తాడు. కానీ, మురుగదాస్ పవర్ ఏంటో ఆయన సినిమాలే చెబుతాయి. తెలుగువారిని ‘గజిని’ అనువాదచిత్రంతో ఆకట్టుకున్న మురుగదాస్ తరువాత చిరంజీవితో ‘స్టాలిన్’ తెరకెక్కించి అలరించారు. మహేశ్ బాబుతో ‘స్పైడర్’ తీసి మురిపించారు. ఇక హిందీలోనూ తొలి చిత్రం ‘గజిని’తోనే బంపర్ హిట్ పట్టేశారు. దేశంలో తొలిసారి వంద కోట్ల క్లబ్ కు తెరతీసిన చిత్రంగా హిందీ ‘గజిని’ నిలచింది. విజయ్ హీరోగా హ్యాట్రిక్ కొట్టేశారు మురుగదాస్. గత సంవత్సరం […]
తెలుగు చిత్రసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరుచూరి బ్రదర్స్ మాటలు కోటలు దాటుతూ, సినీజనానికి కోట్లు సంపాదించి పెడుతూనే ఉన్నాయి. అన్న వెంకటేశ్వరరావు అనురాగం పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఆవేశం ఒలికిస్తారు. ఎంత అన్నదమ్ములైనా నలభై ఏళ్ళుగా కలసి రచనావ్యాసంగం సాగించడమంటే మాటలు కాదు. బహుశా చిత్రసీమలో ఇది ఓ అరుదైన విశేషమని చెప్పాలి. సెంటిమెంట్ ను వండడంలో మేటి వెంకటేశ్వరరావు అని పేరు, ఇక ఎమోషన్ పండించడంలో గోపాలకృష్ణకు సాటి లేరెవ్వరు అంటూ ఉంటారు. వారితో […]
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ రోజు రాత్రికి అది తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని… దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు […]
అప్పట్లో ఇంఛార్జ్‌గా ఉన్న నాయకుడు.. తిలకం దిద్ది మీకే పోస్ట్ అని హామీ ఇచ్చారు. ఇంతలో ఆ ఇంఛార్జే మారిపోయి కొత్త నేత వచ్చారు. అసలే పాత, కొత్త ఇంఛార్జుల మధ్య ఆధిపత్య పోరు ఉండటంతో గత హామీలపై ఆ ఎఫెక్ట్ పడింది. పరిషత్ ఫలితాల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గం ఏంటో.. వారెవరో ఇప్పుడు చూద్దాం. దువ్వాడ, పేరాడ మధ్య నందిగాం పంచాయితీ! శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో నాయకులెక్కువ. వారి మధ్య […]
ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు మంచి ఆరంభమే లభించింది.. కానీ దానిని జట్టు నిలబెట్టుకోలేకపోయింది. బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), దేవదత్ పాడిక్కల్(70) అర్ధశతకాలు సాధించి సెంచరీ భాగసౌమ్యాం నెలకొల్పారు. కానీ కోహ్లీ అవుట్ అయిన తర్వాత […]
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ సినిమా టాకీ పూర్తయింది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఖిలాడి’ నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. అంతకు ముందు వినాయక చవితి సందర్భంగా తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ రెండింటికి చక్కటి స్పందన లభిస్తోందని, ఇటీవల షెడ్యూల్ తో రెండు పాటలు మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని […]
పాపం….! ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను చూస్తున్న పక్కవారు అంటున్న మాట ఇది. కొంతమందికి ఎన్నేళ్ల సీనియార్టీ ఉన్నా పదవులు రావు. ఇంకొందరికి ఎన్ని పదవులు ఇచ్చినా… వాళ్లకి అవి దక్కడం లేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్లకి.. వాళ్లతోపాటు మిగిలిన వారికీ పదవులు ఆగిపోతున్నాయట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఐరన్ లెగ్గుల కథ చూడాల్సిందే. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా బీరేంద్ర..!కాణిపాకం ఆలయ ఛైర్‌పర్సన్‌గా దయాసాగర్ రెడ్డి భార్య..!స్థానికులు అడ్డం తిరగడంతో ఆగిన ప్రమాణ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. టాలీవుడ్ లో కార్పోరేట్ బ్రాండ్ లకు కేరాఫ్ ఆడ్రెస్ గా మారిన మహేశ్ తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దాదాపు 250 కి పైగా స్టోర్లను కలిగిన మొబైల్ ఫోన్ రిటైల్ చైన్ బిగ్ సికి ప్రచారం మొదలెట్టాడు మహేశ్. ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్రాండ్ల కు ప్రచార […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ సమయంలో ఇసుక తుఫాన్ కారణంగా టాస్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి ఈ జట్లు. ఒకవేళ ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే మొదటి ప్లేస్ లో ఉన్న ఢిల్లీని కిందకి […]