ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు పంజాబ్ బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. నిర్ణిత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్న పంజాబ్ జట్టులో ఎవరు చెప్పుదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ జట్టులో ఐడెన్ మార్క్రమ్(27) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి సన్ రైజర్స్ 126 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉంది. కానీ గత మ్యాచ్ లలో ఆ జట్టు చేసిన ప్రదర్శతో పోల్చితే ఇదే వారికీ కొంత కష్టమైన లక్ష్యమే. చూడాలి మరి హైదరాబాద్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ రైజ్ అవుతారా.. లేదా అనేది.