ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ లలో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని అనుకుంటుంది. అలాగే పాయింట్స్ టేబుల్ లో ఆఖరి నుండి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి పైకి వెళ్లాలని అనుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
పంజాబ్ : కేఎల్ రాహుల్(c/w) , మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్
హైదరాబాద్ : డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్