వీకెండ్ సందర్భంగా ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతుండగా.. అందులో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగగా… అందులో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన రాజస్థాన్ మొదటి నుండి తడబడింది. పవర్ ప్లే లోనే వరుస వికెట్లు కోల్పోయింది. అయితే ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి 70 పరుగులు చేసిన మిగితా వారు అందరూ విఫలం కావడంతో ఫలితం లేకుండా పోయింది. దాంతో నిర్ణిత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి రాయల్స్ కేవలం 121 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఈ సీజన్ లో 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో మాత్రమే కాదు ప్లే ఆఫ్స్ లో బెర్త్ ను కూడా దాదాపు ఖాయం చేసుకుంది.