విజయవాడ గ్రామీణం నున్న పంచాయతీ పరిధిలోని పవర్ గ్రిడ్ సెంటర్ శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లీవ్ అపార్ట్‌మెంట్‌లో నెలకొల్పిన వినాయక విగ్రహం విపోధా ఫిస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేడుకల చివరి రోజును నిర్వహించి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని రూ 26 లక్షలకు సొంతం చేసుకున్నారు.
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్లో, ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. కొన్ని సార్లు థియేటర్లో మిస్ అయిన చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒక సమస్యపై దృష్టి పెట్టిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం విధానానని స్పష్టం చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయంగా ఉంచుతారా, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారో చెప్పాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడలో గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి గ్యాస్ లారీ దూసుకెళ్లింది. దుకాణం ఎదుట పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్‌గా నిలిచింది.
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడు సాయివిష్ణును పెళ్లాడారు. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో వీరి వివాహం జరిగింది.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందికు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది.